సాధారణంగా ఒక హీరో కి అభిమాని అంటే అభిమాన హీరో సినిమా వచ్చినప్పుడు చాలా హంగామా చేయడం.. లేదా ఎవరికైనా దానధర్మాలు చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక బాలయ్య అభిమాని మాత్రం ఏకంగా అఖండ సినిమా స్టార్టింగ్ లో బాలయ్య బాబు తీసుకున్న ఒక జీపును రెండేళ్ల క్రితం షూటింగ్ సమయంలో చూశాడట. అయితే ఆ జీపును ఆర్డర్ ఇచ్చి మరి తయారు చేయించారట. ఆయన తాజాగా అఖండ సినిమా థియేటర్ల ముందు తన జీపు తో బాలయ్య మీద ఉన్న అభిమానాన్ని నిరూపించుకున్నాడు.
అనంతపురం జిల్లా తాడిపత్రి లో నటుడు బాలకృష్ణ వీరాభిమాని అయిన వేలూరు కృష్ణమూర్తి, 2019 సంవత్సరంలో ఈ జీపును బాలకృష్ణ అఖండ షూటింగులో చూసి, ఇలాంటి జీపును తీసుకోవాలని ఆసక్తితో.. హర్యానాలోని మండి డబీ అనే జీపు మార్కెట్లో అచ్చం అలాంటి జీపునే ప్రత్యేకంగా ఆర్డర్ చేయించి మరీ తయారు చేయించారట.. తాడిపత్రికి తెప్పించి అభిమానాన్ని చాటు కున్నారు.ఈ వాహనం తయారు చేయడానికి రెండు సంవత్సరాల కాలం పట్టిందని, నేటికి జీపు తయారీ పూర్తి కావడంతో, నేను ఈ వాహనంలో తిరుగుతున్నానని, అలా తిరగడం పట్ల, బాలకృష్ణతో కలిసి తిరిగినట్లు అనుభూతి కలుగుతుందని మీడియాతో తెలియజేసారు.