ఏకంగా 5 సినిమాలకు కమిట్ అయిన మాస్ మహారాజా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

సినీ ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి , ఆ తర్వాత బయట క్యారెక్టర్ ఆర్టిస్టుగా అందరి చేత గుర్తింపు పొందిన తరువాత ఏకంగా స్టార్ హీరోగా అనతికాలంలోనే గుర్తింపు పొందడం అంటే అంత ఆషామాషీ కాదు.. కేవలం ఆ ఘనత మాస్ మహారాజా రవితేజ కు దక్కింది అని చెప్పవచ్చు. గత కొన్ని సంవత్సరాలుగా డిజాస్టర్ లకు దగ్గరగా ఉన్న మాస్ మహారాజా, ఈసారి క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుని, వరుస సినిమాలతో బిజీ అయిపోతున్నాడు. అంతే కాదు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు చేస్తున్నాడు రవితేజ. సాధారణంగా ఒక హీరో ఒక సినిమా షెడ్యూల్ చేసుకోవడానికి తలమునకలు అవుతుంటారు.. ఇక్కడ మాస్ మహారాజా మాత్రం 5 సినిమాల షూటింగుల్లో బిజీగా ఉండడం గమనార్హం.

అంతేకాదు ఈ సినిమా వాళ్లకి డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తున్నాడో కూడా తెలియడం లేదు. అంతేకాదు ప్రస్తుతం మాస్ మహారాజా స్పీడ్ చూసి మిగిలిన హీరోలు కూడా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. ఇక యంగ్ డైరెక్టర్ లకు కూడా అవకాశాలు ఇస్తున్నాడు రవితేజ. ఇక ఏ ఏ సినిమాలు అంటే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ, కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ, త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా, వంశీ దర్శకత్వంలో టైగర్ నాగేశ్వరరావు, యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రావణాసుర సినిమాలకు కమిట్ అవ్వడమే కాకుండా ఒకే టైం లో అన్ని సినిమా షూటింగ్ లలో నటిస్తూ ఉండడం గమనార్హం.

Share.