అఖండ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రగ్యా జైస్వాల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

అప్పట్లో తక్కువ థియేటర్లు మాత్రమే ఉండేవి.. ఇక సిటీస్ లో ఎక్కువగా స్టార్ హీరోల సినిమాలు కటౌట్లు మాత్రమే కనిపించేవి. అభిమానులు కూడా తమ హీరోల సినిమాలు విడుదలయ్యాయి అంటే వారి కటౌట్ ల దగ్గర టెంకాయలు వంటివి కొట్టేవారు. ఇలాంటి పద్ధతి పోయి ఎన్నో రోజులు అయింది. కానీ తాజాగా బాలకృష్ణ నటించిన అఖండ సినిమా తో తిరిగి మళ్లీ ఇలాంటివి పుంజుకున్నాయి. తెలుగు రాష్ట్రాలలో సైతం కలెక్షన్లను బాగానే రాబట్టాయి.

ఈ సినిమాలో బాలయ్య కొత్తగా కనిపించడం తో ఈ సినిమా విజయకేతనం ఎగురవేసింది. బాలయ్య బాబు కి హీరోయిన్లు దొరకడం కష్టం గా మారుతోంది. గతంలో కూడా ఎంతో మంది కథానాయికలను అడగగా వారు ససేమిరా ఒప్పుకోలేదు. కానీ ఈసారి కథానాయిక మాత్రం చాలా పర్ఫెక్టుగా కుదిరిందని తెలుస్తోంది. బాలయ్య పక్కన ఆమె నటనతో బాగా మైమరిపించింది. మొదటిసారిగా వీరిద్దరూ కలసి ఉన్న ఒక పోస్టర్ కూడా బయటకు రావడంతో ఈ జంట ఎంతో అద్భుతంగా కనిపిస్తున్నారని వార్త కూడా వినిపించిందట. ఇక సినిమా చూసిన తర్వాత కూడా అభిమానుల అభిప్రాయం కూడా అలాగే మారిపోయింది.

నిన్నటి రోజున ఈ సినిమా సక్సెస్ ఈవెంట్లో హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మాట్లాడిన మాటలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. బాలకృష్ణతో నటించడం నాకు చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఈ సినిమా చూసిన వారందరూ తనకు మంచి రెస్పాన్స్ ఇచ్చారు అని తెలిపింది. ఈ సినిమా సక్సెస్ కావడం లో నా భాగం కూడా ఉన్నందుకు నా అదృష్టం అని తెలిపింది. నన్ను ఇంతలా అభిమానిస్తున్న అభిమానులకు ప్రేక్షకులకు థాంక్స్ చెబుతున్నానంటు తెలిపింది. ఈ అవకాశం ఇచ్చిన బాలకృష్ణ, బోయపాటికి ధన్యవాదాలు తెలిపింది. బాలకృష్ణ నుంచి ప్రతి రోజు కొత్త విషయాలను నేర్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

Share.