అఖండ విజయం చూసి బోయపాటి శ్రీను రేంజ్ ఎంతో మనం అర్థం చేసుకోవచ్చు. టాలీవుడ్ లో సినిమా లు కొన్ని వందల కోట్ల రూపాయలను వసూలు చేస్తూ ఉండడం గమనార్హం . ఇక ఇందుకోసం హీరోలు, దర్శకులు కూడా రెమ్యునరేషన్ బాగా పెంచేసారు. టాప్ హీరోలు ఒక్కో సినిమాకు రూ. 50 నుంచి రూ. 70 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. ఇక టాప్ డైరెక్టర్స్ కూడా ఒక రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకోవడం గమనార్హం. ఇకపోతే త్రివిక్రమ్ తప్ప మిగతా స్టార్ డైరెక్టర్ లు అందరూ పది కోట్ల రూపాయల వరకు మినిమం తీసుకుంటున్నట్లు సమాచారం.
ఇకపోతే వినయ విధేయ రామ సినిమా తర్వాత బోయపాటి శ్రీను తో కలిసి పనిచేసిన నిర్మాత సినీ ఇండస్ట్రీలో కనిపించలేదు అంటే అంతగా ఈ సినిమా భారీ నష్టాలను చవిచూసింది.. మొన్నటి వరకు ఐదు కోట్ల రూపాయలు తీసుకున్న బోయపాటి శ్రీనుకు అఖండ సినిమాకు ఎంత పారితోషికం ఇవ్వాలి అనే విషయం పై నిర్మాతలు పెద్ద ఎత్తున డిస్కషన్ చేసుకున్నారట.ఇక పోతే ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తీసుకొని బోయపాటి శ్రీను సినిమా కలెక్షన్లను బట్టి షేర్ ఇస్తానని చెప్పారట నిర్మాతలు.. ఇకపోతే ఈ సినిమా థియేటర్ బిజినెస్ అలాగే వచ్చిన షేర్లను బట్టి బోయపాటికి సుమారుగా పది కోట్లకు పైగా రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం.