అఖండ సినిమాలో బాలయ్య బాబు విగ్గుకు అన్ని కోట్లా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో నటసింహ బాలకృష్ణ హీరోగా వచ్చిన సినిమా అఖండ . ఈ సినిమా విడుదలై విశేష ప్రేక్షకాదరణ అందుకోవడమే కాకుండా ఈ సంవత్సరం అత్యధిక షేర్ ను రాబట్టిన సినిమాగా గుర్తింపు పొందడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ల రేట్లను తగ్గించినప్పటికీ ఈ సినిమా థియేటర్లలో విడుదలై విశేష కలెక్షన్లు సాధించడంతో మిగిలిన పెద్ద పెద్ద నిర్మాతలకు ఊరట లభించిందని చెప్పవచ్చు. పెద్ద పెద్ద సినిమాలు కూడా థియేటర్లలో విడుదల చేయడానికి క్యూ కడుతున్నాయి.

ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య బాబు విగ్గు కోసం ఏకంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే నిజంగా బాలయ్య బాబు విగ్గు కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టారో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం. బాలయ్య బాబు ను సినిమా లో అందం గా చూపించడం కోసమే నిర్మాతలు లక్షలు ఖర్చు చేసినట్టు సమాచారం.ఈ సినిమాలో బాలయ్య విగ్గుకి ఏకంగా 50 లక్షల రూపాయలను ఖర్చు చేశారట.రూ.39 లక్షలను ఖర్చు చేసి మరో మూడు విగ్గులను కొనుగోలు చేసినట్లు సమాచారం.

Share.