అక్కడ అఘోరాల వివాహం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళనాడు ప్రాంతానికి చెందిన మణికండన్ అనే అఘోర తన తల్లి మరణించినప్పుడు ఆమె శరీరంపై కూర్చొని అఘోర సంప్రదాయం ప్రకారం పూజలు, అంత్యక్రియలు నిర్వహించి వార్తల్లో నిలిచాడు. ప్రస్తుతం అతనికి పెళ్లి అట్టహాసంగా జరిగింది. తమిళనాడుకు చెందిన మణి కండన్ అనే ఘోర తన శిష్యురాలైన అఘోరా ను వివాహం చేసుకున్నాడు.

అసలు విషయంలోకి వెళ్తే  మణికండన్  అనే వ్యక్తి కాశీలో అగోర ఉపాసన చేసి అఘోరా గా మారాడు. తమిళనాడులోని తన స్వగ్రామానికి చేరుకున్నాడు. ఆ గ్రామంలో జై ఘోర కాశి దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. అఘోర ఆరాధన ఇష్టపడే వారిని తన శిష్యులుగా చేర్చుకున్నాడు. అలా కలకత్తాకు చెందిన ప్రియాంక అనే మహిళ  మణికండన్ వద్ద అఘోరిని మహిళా అఘోరీలకు ఉపాసన చేస్తోంది.

ఈనెల 22వ తేదీన ఉదయం ఆఘోర మణి కండన్ అఘోర ప్రియాంక ను వివాహం చేసుకున్నాడు. వారు వివాహం చేసుకున్న సమయంలో ఎన్నో యజ్ఞాలు జరిగాయి. ఇంకా తన తోటి ఆఘోరాలు కూడా అక్కడికి వచ్చి డాన్స్ వేస్తూ, శంఖం ఊదుతూ, డమరుకం ఆడారు.

Share.