బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ తాజాగా జరిగిన ఒక ఈవెంట్ కోసం తన తల్లి బృంద రాయ్ తో కలిసి హాజరయ్యారు. అయితే ఎప్పుడు నవ్వుతు అందరిని నవ్విస్తూ ఉండే మన ఐశ్వర్య రాయ్ ఈ ఈవెంట్ లో ఏడుస్తూ కనిపించరు. ఈవెంట్ లో భాగంగా మన జాతీయ గీతం ప్లే అవుతుండగా ఉద్వేగానికి లోనైన ఐశ్వర్య రాయ్ ఒక్కసారిగా కంటతడి పెట్టారు. సాధారణముగా మన లో ప్రతి ఒక్కరికి దేశ భక్తి ఉంటుంది, ముఖ్యంగా జాతీయ గీతం పాడుతుండగా మనం కూడా ఎంతో ఉద్వేగానికి లోనవుతాం. దీనికి ప్రముఖులు సైతం అతీతం కాదని ఈ వీడియో ద్వారా నిరూపితమయ్యింది. ఎంతో మంది సైనికులు దేశ సరిహద్దులో ప్రాణ త్యాగం చేస్తేనే మనం ఇక్కడ ఇంత ప్రశాంతంగా, సంతోషంగా జీవిస్తున్నాము. మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం అంటే అది కేవలం మన సైనికుల వలెనే, వారు చేసిన ప్రాణ త్యాగాలు, దేశం కోసం చేస్తున్న పోరాటం గుర్తుకు వస్తే ఎవరైనా కంటతడి పెట్టాల్సిందే. ఈ వీడియో ఆఖర్లో ఐశ్వర్య అక్కడున్న కొంత మంది ముగా పిల్లలకి ఏవో సైగలు చేస్తూ కనిపించరు. వారిని చూసిన సమయంలో ఐశ్వర్య మరింత ఉద్వగానికి లోనైయ్యారని అక్కడున్న వారు తెలిపారు. ఇక ప్రస్తుతం ఐశ్వర్య రాయ్ వీడియో నెట్ లో హాల్ చల్ చేస్తుంది. ఐశ్వర్య రాయ్ చివరగా ‘ ఫనే ఖాన్ ‘ చిత్రంలో నటించింది. త్వరలో ఆమె అభిషేక్ బచ్చన్ తో కలిసి మరో సినిమాలో నటించనుంది.