బాలీవుడ్ లోని కొంతమంది హీరోలతో హీరోయిన్స్ సైతం ప్రేమాయణం నడుపుతూ ఉంటారు.. అలా ఐశ్వర్యరాయ్ చివరికి అమితాబచ్చన్ కుమారుడు అభిషేక్ బచ్చన్ ని వివాహం చేసుకున్నది.. 2007వ సంవత్సరంలో వీరి వివాహ కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య చాలా ఘనంగా జరిగింది.. అయితే వీరికి 2011లో ఒక పాప కూడా జన్మించింది.ఆమెకు ఆరాధ్య అనే పేరు కూడా పెట్టారు. ఒకరంకంగా వీరిద్దరని బాలీవుడ్లో క్యూట్ కపుల్స్ గా పేరు పొందారు.
అయితే ఇప్పుడు తాజాగా ఈ జంట మధ్య పలు విభేదాలు వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ విడిపోబోతున్నారంటూ సరికొత్త ప్రచారం మొదలైంది. అయితే ఇందులో ఎంత నిజాలు ఉన్నాయో తెలియదు కానీ ఇప్పటివరకు ఈ విషయం మీద అయితే ఎవరు క్లారిటీ ఇవ్వలేదు.. ఇటీవల నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ఓపెనింగ్ కి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన కుమార్తె ఆరాధ్యతో కలిసి హాజరయ్యింది ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని చెప్పడం జరిగింది.
అమితాబ్ మనవరాలు అభిషేక్ , ఐశ్వర్య కుమార్తె ఆరాధ్య ఫోటోలలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. అయితే వారందరూ వచ్చారు అని సంబరపడే అభిమానుల కంటే అభిషేక్ బచ్చన్ ఎందుకు రాలేదని ఆరా తీసే వారి సంఖ్య ఎక్కువ అయినట్లుగా తెలుస్తోంది.. కొంతమంది ఈ విషయం పైన మాట్లాడుతూ కొంపతీసి వీరికి విడాకుల కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అందుకే వీరిద్దరూ బయట కలిసి ఎక్కడ కనిపించలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం మాత్రం బాలీవుడ్ లో తెగ వైరల్ గా మారుతోంది ..కానీ అమితాబచ్చన్ వంటి కుమారుడు విడాకులు తీసుకుంటే ఆ వార్త వైరల్ గా మారడం ఖాయమంటూ వార్తలు వినిపిస్తున్నాయి.