Aishwarya..రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య(Aishwarya), హీరో ధనుష్ గత కొద్దిరోజుల క్రితం విడాకుల ప్రకటనతో కోలీవుడ్‌లో పెను సంచలనాన్ని సృష్టించింది. రజిని పెద్ద కుమార్తె అయిన ఐశ్వర్య డైరెక్టర్ గానే కాకుండా గాయనిగా కూడా మంచి పేరు సంపాదించింది. ఒక సినిమా ప్రమోషన్స్‌లో కామన్ ఫ్రెండ్ ద్వారా ధనుష్ తో ఏర్పడిన పరిచయం ఈమె అతి తక్కువ సమయంలో ధనుష్ తో ప్రేమలో పడింది. 2004 నవంబర్ 18న వీరి వివాహం చాలా అంగరంగ వైభవంగా జరిగింది వీరికి ఇద్దరు మగ పిల్లలు కూడా జన్మించారు.
ధనుష్ కంటే ఐశ్వర్య రజనీకాంత్ వయసు రెండు సంవత్సరాలు పెద్దది. అప్పటికే ఐశ్వర్య కు కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల కుటుంబాల నుంచి పెళ్లి సంబంధాలు వస్తూ ఉండేవట. అయితే ధనుష్ నే చేసుకుంటానని ఐశ్వర్య రజనీకాంత్ పట్టుపట్టడంతో పాటు కాస్త దగ్గర బంధుత్వం కూడా ఉండడంతో రజనీకాంత్ ఆమె కోరికను కాదనలేకపోయారట. అయితే ఆ మధ్య సూచీ లీక్స్ వ్యవహారం మొత్తం కోలీవుడ్ ని షేక్ చేసిందని చెప్పవచ్చు.
ముఖ్యంగా శృతిహాసన్ అమలాపాల్ తో ధనుష్ ఎఫైర్ ఉందని వార్తలు ఎక్కువగా వినిపించాయి. దీంతో ఈ విషయంపై రజనీకాంత్ జోక్యం చేసుకొని సర్ది చెప్పడంతో వీరు కలిసే ఉన్నట్లు సమాచారం. కానీ ఈసారి మాత్రం చేసేదేమీ లేక విడిపోవడం జరిగింది. కేవలం ధనుష్ కు హీరోయిన్లతో ఎఫైర్ ఉండడం వల్లే వీరు విడిపోవలసి వచ్చింది అనే ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. అయితే ఐశ్వర్యాకు కూడా ధనుష్ తో పెళ్లికి ముందు ఒక హీరోతో ఎఫైర్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో ఎవరో కాదు నటుడు శింబు. ధనుష్ తో ప్రేమకు ముందు ఐశ్వర్య శింబు తో ప్రేమలో ఉన్నట్లు కోలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపించాయి. ఈ విషయం తెలిసి రజనీకాంత్ కాస్త డిసప్పాయింట్ కావడంతో ఐశ్వర్య , శింబు మధ్య దూరం పెరిగిపోయింది.