టాలీవుడ్ లో ఒకప్పుడు ఎంతో వెలుగు విరిగిన నటి హీరోయిన్ ఆర్తి అగర్వాల్. తన అందంతో సినీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఆర్తి అగర్వాల్. ఎంతమంది అగ్ర హీరోల సరసన అందరితో నటించింది. చాలా వరకు మంచి మంచి సినిమాల్లో కూడా నటించి మంచి సక్సెస్ను అందుకుంది. 2001 లో తొలిసారిగా నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నది.
ఆర్తి అగర్వాల్ నటించిన సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.ఇమే నటిగా కంటే.. తన వ్యక్తిగత విషయాలలోనే చాలా హాట్ టాపిక్గా మారింది. తరుణ్ తో కలిసి ప్రేమతో ఉన్నట్లుగా కూడా అప్పట్లో వార్తలు వినిపించాయి.ఇక ఆ హీరోతో ప్రేమలో విఫలం కావడంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది అనే వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత 2007 లో న్యూజెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నది. కానీ భర్తతో మనస్పర్థలు రావడంతో విడిపోయింది.
ఆ తరువాత సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అవకాశాలు పెద్దగా రాలేదు. ఒకసారి సినిమా షూటింగ్ లో.. వ్యక్తిగత విషయాలను పంచుకున్నట్లు గా సమాచారం. తానని సరిగ్గా అర్థం చేసుకోకుండా తొందరపడి వివాహం చేసుకున్నానని, ఆ తర్వాత ఇష్టపూర్వకంగా విడిపోయామని తెలిపింది.ఇక తన జాతకంలో రెండు పెళ్లిళ్లు అవుతాయి అని రాసి ఉందని తెలిపింది. ఈ సారి చూసుకొని ఆలోచించి వివాహం చేసుకుంటానని తెలిపింది.. అంతలోనే ఆమె మరణించింది.