ఆషో లో బాలయ్యతో పోటీకి దిగిన రాజమౌళి.. కీరవాణి ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

నందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో అఖండ సినిమా చేసి ఊహించని విధంగా విజయాన్ని అందుకున్నారు. ఇప్పటికే విడుదలై 12 రోజులే అయినప్పటికీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమాతో బాలయ్య బాబు మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఆయన ఆహా లో సెలబ్రిటీ టాక్ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ షో కి మొదటి సారి మోహన్ బాబు వచ్చి సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి ద్వారా ఎన్నో విషయాలను ప్రజలు తెలుసుకోగలిగారు.

Rajamouli and Keeravani on Unstoppable with NBK | 123telugu.com

ఇక తర్వాత నాచురల్ స్టార్ నాని వచ్చి సందడి చేయగా.. ఆ తర్వాత హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, అనిల్ రావిపూడి వచ్చి సందడి చేశారు. గత వారం ఎపిసోడ్ లో అఖండ టీం మెంబర్స్ వచ్చి బాగా అల్లరి చేసిన విషయం కూడా తెలిసిందే..అయితే తాజాగా ఈ షో కి సంబంధించిన ఒక ఫోటో లీక్ కాగా..ఇందులో దర్శకధీరుడు రాజమౌళి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి ఇద్దరు హాజరయ్యారు అన్నట్లుగా ఈ ఫోటో ద్వారా తెలుస్తోంది.. ఇక షో కి సంబంధించిన ప్రోమో ఇంకా విడుదల కాకపోయినప్పటికీ ఒక చిన్న ఫోటో బయటికి రావడంతో ప్రస్తుతం అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందో అని చూడటానికి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Share.