ఏ ఇండస్ట్రీలోనైనా సరే నెంబర్ వన్ పొజిషన్ కోసం అభిమానులు ఎక్కువగా గొడవలు పడుతూ ఉంటారు. హీరోలకి లేకపోయినప్పటికీ వారి యొక్క అభిమానులకు మాత్రం ఎప్పుడూ తమ హీరోని నెంబర్ వన్ స్థానాన్ని అంటూ అభిమానులు కామెంట్లు చేస్తూ ఉంటారు. తాజాగా తమిళ హీరో విజయ్ దళపతి విషయంలో కూడా ఇదే జరుగుతోంది. కోలీవుడ్లో నెంబర్ వన్ టాప్ హీరో విజయ్ అని అంటూ ఉంటారు రీసెంట్గా దిల్ రాజు దీనికి ప్రాణం పోశారు. విజయ్ ను మించిన హీరో లేడని అజిత్ కంటే స్టార్ హీరో అని తమిళనాడులో విజయ్ నెంబర్వన్ హీరో అని ఆకాశానికి ఎత్తేశారు.
దీంతో ఒక్కసారిగా అజిత్ అభిమానులు ఆగ్రహానికి లోనవుతున్నారు. దిల్ రాజును సోషల్ మీడియాలో చాలా దారుణంగా ట్రోల్ చేయడం జరుగుతోంది. దింతో విజయ్ అభిమానులు మాత్రం అతనికి సపోర్టుగా నిలుస్తూ ఉన్నారు. ఇప్పుడు రజనీకాంత్ ఫ్యాన్స్ కూడా ఇన్వాల్వ్ కావడం జరుగుతోంది .దీనికి కారణం వారసుడు సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్లు విజయ్ అభిమానులు చేసిన పనే.. విజయ్ సైలెన్స్ ఫ్యాన్స్ అత్యుత్సాహం రజనీకాంత్ ఫ్యాన్స్ కి చాలా ఆగ్రహాన్ని రేపుతున్నాయి.
ఇక ఆడియో లాంచ్ ఈవెంట్లో విజయిని నెంబర్ వన్ హీరో అంటూ ఫ్యాన్సు రచ్చ రచ్చ చేశారు. అభిమానుల మాటలకు తగ్గట్టుగానే విజయ్ సైలెంట్ గా ఉన్నారు. ఇన్నాళ్లు సినీ జీవితంలో ఒక్కడే తనతో పోటీపడ్డాడని ఆ ఒక్కడి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అని అన్నారు. అయితే ఇప్పుడు ఇదే రజనీకాంత్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. రజనీకాంత్ తో పోటీ పడే స్థాయి విజయ్ కి లేదని అందుకే తనతో తానే పోటీ పడినట్లుగా చెప్పుకొచ్చారని రజనీకాంత్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీంతో తమిళనాడులో ఒక పెద్ద వార్ జరుగుతోందని చెప్పవచ్చు. అయితే నెంబర్ వన్ పొజిషన్ మాత్రం ఎప్పుడూ మారుతూనే ఉంటుందని చెప్పవచ్చు.