సుప్రియతో పెళ్లి అడివి శేష్ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

లాస్ట్ ఇయర్ గూఢచారి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అడివి శేష్ ఆ సినిమాలో అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియతో కలిసి నటించడం జరిగింది. శోభిత దూళిపాళ హీరోయిన్ గా నటించగా సుప్రియ ఓ ఇంపార్టెంట్ రోల్ లో నటించారు. అయితే ఆ సినిమా టైంలో అడివి శేష్, సుప్రియల మధ్య మంచి రిలేషన్ ఏర్పడి అది పెళ్లి బంధానికి దారి తీస్తుందని అన్నారు. గత రెండు రోజులుగా అడివి శేష్, సుప్రియల పెళ్లి విషయంపై సోషల్ మీడియాలో ఒకటే రచ్చ జరుగుతుంది.

అయితే ఇది ఇలానే ఉంటే కష్టమని హీరో అడివి శేష్ తన ఇన్ స్టాగ్రాం లో ఈ విషయంపై వివరణ ఇచ్చాడు. తనకు యాక్టింగ్, రైటింగ్ తప్ప మిగతా ఏవి లేదని.. నా జీవితంలో పెద్ద విషయం అంటే అది కేవలం సినిమా మాత్రమే అని.. కష్టపడుతున్నా, నా బెస్ట్ ఇచ్చేందుకు నన్ను నేను మెరుగు పరచుకుంటున్నా అంటూ పెళ్లి వార్తపై అదిరిపొయే ఆన్సర్ ఇచ్చాడు అడివి శేష్. ఒక సినిమాలో నటించి కాస్త క్లోజ్ గా మూవ్ అయితే వారిద్దరి మధ్య ఏదో ఉందని నిర్ణయించేస్తాం.. సో అడివి శేష్ ఇచ్చిన క్లారిటీతో సుప్రియ, అడివి శేష్ ల మ్యారేజ్ న్యూస్ కు ఎండ్ కార్డ్ పడినట్టే.

Share.