రకుల్ కి థాంక్స్ చెప్పిన ఆది పినిశెట్టి, కారణం తెలిస్తే షాకే

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి ఈ రోజు ట్విట్టర్ వేదికగా నటి రకుల్ ప్రీత్ కి కృతజ్ఞత తెలిపాడు. దానికి గల అసలు కారణం ఆది, తాప్సి జంటగా నటించిన ‘నీవెవరో’ సినిమాలోని ఒక పాటని ఈ రోజు రకుల్ చేత విడుదల చేయించారు చిత్ర యూనిట్. దానికి కృతజ్ఞతగా ఆది రకుల్ కి థాంక్స్ చెప్పారు. ఇది కాస్త ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది.

ఆది పినిశెట్టి, తాప్సి తొలిసారి జోడిగా ఈ సినిమాలో ప్రేక్షకులని అలరించనున్నారు. ఇక ఈ రోజు విడుదల చేసిన ‘వెన్నెల’ అనే లిరికల్ సాంగ్ కూడా సంగీత ప్రియులని బాగా ఆకట్టుకుంది. ఇటీవలే విడుదల చేసిన సినిమా ఫస్ట్ లుక్ మరియు పోస్టర్స్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ రోజు విడుదల చేసిన పాటతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. నటి రితిక సింగ్ కూడా ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర లో కనిపించనున్నారు. హరినాథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా శ్రీరామ్ స్వరాలూ సమకూరుస్తున్నారు. ఈ సినిమాని వచ్చే నెల విడుదల చేయటానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.

Share.