టైటిల్ విని షాక్ అయ్యాను.. నటి వాసంతి?

Google+ Pinterest LinkedIn Tumblr +

సంపూర్ణేష్ బాబు మనందరికీ సుపరిచితమే. మొదట హృదయకాలేయం సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా కాలిఫ్లవర్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో సంపూర్ణేష్ బాబు వాసంతి జంటగా నటించారు. ఆర్ కె మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, గూడూరు శ్రీధర్ సమర్పణలో ఆశాజ్యోతి గోగినేని నిర్మించారు. సినిమా ఈ నెల 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ వాసంతి మాట్లాడుతూ..

తాను తెలుగు అమ్మాయిని బెంగళూరు చదువుకున్నానని, ఏరోనాటికల్ ఇంజనీర్ అవుదాం అనుకొని హీరోయిన్ అయ్యాను అని తెలిపింది. కన్నడ లో ఏం సినిమాలు చేశాను. ప్రస్తుతం కాలిఫ్లవర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఇస్తున్నాను అని తెలిపింది. ఇందులో ఆమె సంపూర్ణేష్ బాబు కు మరదలుగా నీలవేణి క్యారెక్టర్ లో నటించిందట. ఈ క్యారెక్టర్ నా కోసమే డిజైన్ చేశారా అన్నట్లు నాకు అనిపించింది కొందరిలా నేను కూడా కాలీఫ్లవర్ టైటిల్ విని షాకయ్యాను అని చెప్పుకొచ్చింది. కానీ ఈ సినిమా సస్పెన్స్, థ్రిల్,కామెడీ, మెసేజ్ ఉన్న చిత్రంగా ఆడియన్స్కు నచ్చుతుంది అని ఆమె తెలిపింది.

Share.