తెలుగు సినీ ప్రేక్షకులకు నటి ప్రగతి గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. ఈమె సినిమాల ద్వారా ఎంత పాపులారిటీ సంపాదించుకుందో అదేవిధంగా సోషల్ మీడియా ద్వారా అంతకు మించి పాపులారిటీని సంపాదించుకుంది. ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.సినిమాలలో సాంప్రదాయ పద్ధతిలో కనిపించినా ఈమె రియల్ లైఫ్ లో మాత్రం హాట్ గా ఫోజులు ఇస్తూ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.
ఆ మధ్య ఒక సారి జిమ్ లో వర్కవుట్ చేస్తున్న ఫొటోస్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఆ తరువాత ఇటీవలే ఒక పెళ్లి ఫంక్షన్ లో రోడ్డుపైన డాన్స్ ఇరగతీసింది. అయితే ప్రగతి ఫిట్నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనే విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా మరొకసారి జిమ్ లో స్టెప్పులు ఇరగదీసింది.జిమ్ లో నాగిని పాటకు ఆమె స్టెప్పులు ఇరగదీసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోని ఆమె తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ నేను చేసే ప్రతి పనిలో ఆనందాన్ని సృష్టిస్తాను అంటూ కాప్షన్ ను జోడించింది.