హీరోయిన్స్ ని మించిన అందంతో మెస్మరైజ్ చేస్తున్న నటి హేమ కూతురు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సీనియర్ నటి హేమ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా బ్రహ్మానందం నుంచి మొదలుకొని ఎమ్మెస్ నారాయణ అంటే కమెడియన్ల వరకు అందరితో కూడా భార్య పాత్రలలో నటించి మెప్పించిన ఈమె తన నటనకు ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో పిన్ని, వదిన , అత్త పాత్రలతో నటించి మెప్పించిన హేమ గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.

అయితే హేమ ఇలా సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి గల కారణం ఆమె ఇతర వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉండడమే అని సమాచారం. అందుకే సినిమా ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. ఇకపోతే ఈ క్రమంలోని హేమ ఇండస్ట్రీకి దూరంగా ఉండడంతో తన కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆలోచనలో కూడా ఉన్నారని పలువురు భావిస్తున్నారు . అయితే తన కుమార్తెను ఇండస్ట్రీకి పరిచయం చేసే ఆలోచనలో తానులేనని గతంలో ఎన్నోసార్లు మీడియా సమావేశంలో హేమ తెలియజేశారు.

ప్రస్తుతం హేమ కూతురు వయసు 22 సంవత్సరాలు.. ఆమె బి బి ఏ చదువుతోంది. ఆమె పేరు ఈషా.. ప్రస్తుతం ఉన్నత చదువులు చదువుతుండడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. అయితే తాజాగా లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి చాలా వైరల్ గా మారుతున్నాయి. నటి హేమ కూతుర్ని చూసిన అందరూ కూడా హీరోయిన్ లని మించిన అందంగా ఉంది ఇండస్ట్రీలోకి వస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఈమెలో హీరోయిన్ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.మరి అభిమానుల కోరిక మేరకు హేమా తన కూతుర్ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తుందో లేదో చూడాలి.

Share.