టాలీవుడ్ లో ఒకప్పుడు చిరంజీవి చిత్రం లో పక్కన తమ్ముడి పాత్రలో నటించిన వెంకట్ సుపరిచితమే.. సినీ ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎలాంటి సమస్యలు వస్తాయో ఎవరము చెప్పలేము. మరికొందరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఇండస్ట్రీకి దూరం అవుతూ ఉంటారు. వెంకట్ హీరోగా మరియు సపోర్టింగ్ పాత్రలో చేసి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక వెంకట్ చిరంజీవితోనే కాకుండా జగపతిబాబుతో శివరామరాజు సినిమాలో తమ్ముడి పాత్రలో చేశారు. అలా వరుస సినిమాలతో ఆకట్టుకున్న వెంకట్ సడన్గా ఇండస్ట్రీకి కనపడకుండా పోయాడు. ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలలో పోషిస్తూ అందరికీ దగ్గరైన వెంకట్ అందరిని ఆకట్టుకున్నారు. ఈమధ్య కనిపించటం లేదు. అయితే ఇప్పుడు రీ ఎంట్రి ఇస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన సినిమాలకు ఎందుకు దూరం అయ్యారనే విషయాన్ని వెల్లడించారు. ఆ నలుగురు సినిమా తర్వాత ఆ ఐదుగురు సినిమా చేశారని చెప్పారు. ఆ సినిమాలో పోలీస్ పాత్రలో నటిస్తుండగా షూటింగ్ టైంలో చిన్న ప్రమాదం జరిగింది. అప్పుడు వెన్నుపూసకు చాలా బలమైన గాయం తగిలింది. దీంతో డాక్టర్లు కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాలని చెప్పటంతో సినిమాలకు దూరం అయిపోయానని తెలియజేశారు.
అంతేకాకుండా సినిమాకు దూరం అయినప్పటికీ ఆ గ్యాప్ లో వ్యాపారం చేస్తూ ఉండేవాడినని తెలిపారు .తనకు అవకాశాలు రాకపోవటం వల్ల దూరం అవ్వలేదని చిన్నవో పెద్దవో అవకాశాలు వస్తూనే ఉన్నాయని చెప్పారు. కానీ అవకాశాలు వచ్చినప్పుడు గాయం అయినందున వాటిలో నటించలేకపోయానని చెప్పారు. ఇప్పుడు రీ ఎంట్రీ ఇచ్చానని మంచి ఆఫర్లు వస్తే మరిన్ని సినిమాల్లో నటిస్తానని చెప్పారు. ఇక వెంకట్ అభిమానులు కూడా రీయంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు.