దీనమైన స్థితిలో నటుడు శ్రీహరి కుటుంబం..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రముఖ దివంగత నటుడు శ్రీహరి గురించి తెలుగు రాష్ట్రాలలోని ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ రియల్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. 2013 వ సంవత్సరంలో ఒక సినిమా షూటింగ్లో తీవ్ర అస్వస్థకు గురైన శ్రీహరి మరణించారు..అయితే శ్రీహరి మరణం తర్వాత ఆయన భార్య పిల్లలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శ్రీహరి భార్య డిస్కో శాంతి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తమకు జరుగుతున్న ఇబ్బందుల గురించి తెలియజేయడం జరుగుతోంది.

Actor Srihari Family Photos – Lovely Telugu

శ్రీహరి గారి మరణించిన తర్వాత తన కుటుంబంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని ఇండస్ట్రీ నుంచి తనకు ఎలాంటి సహాయం కూడా అందలేదని శ్రీహరి మరణించిన తర్వాత ఆయన డబ్బులు ఎవరికి ఇచ్చారు ఏంటనే విషయాలు కూడా తమ కుటుంబానికి తెలియదని.. శ్రీహరి మాకు డబ్బులు ఇవ్వాలంటే చాలామంది మా ఇంటికి వచ్చారని చాలామంది అప్పుల పేరుతో తమ ఇంటికి వచ్చి తమ ఇంటి పైన చాలా ఒత్తిడి చేశారని డిస్కో శాంతి తెలియజేయడం జరిగింది..

ఈ విధంగా అప్పుల ఒత్తిడి అధిగమించడంతో చేసేది ఏమీ లేక ఉన్న భూములు ఆస్తులను బంగారును మొత్తం అమ్మేశామని తెలుపుతోంది డిస్కో శాంతి.. కేవలం తన వద్ద శ్రీహరి తన మెడలో కట్టిన తాళి తప్ప ఏమీ లేదని ఎమోషనల్ అయింది.. అయితే తాము ఎంతో ఇష్టంగా కొనుక్కున్న ఒక కారు కూడా ఈఎంఐ కట్టలేక బ్యాంకు వాళ్ళు తీసుకువెళ్లారని తెలిపారు..ప్రస్తుతం తమకు రెండేళ్లు ఉన్నాయని ఆ రెండు ఇల్లు ద్వారా వచ్చే అద్దెతోనే తమ జీవితాన్ని గడిపేస్తున్నామని డిస్కో శాంతి తెలిపింది.

అయితే తనకు సినిమాలలో ఏదైనా అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని ఈ సందర్భంగా డిస్కో శాంతి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. శ్రీహరిని అభిమానించే అభిమానులు ఈ వార్త విని చాలా బాధపడుతున్నారు అంత గొప్ప నటుడుగా పేరుపొందిన కుటుంబానికి ఇలాంటి తిప్పలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు

Share.