అభిమాని సాహాసంపై రామ్, ఛార్మి ఎమోషనల్ ట్వీట్

Google+ Pinterest LinkedIn Tumblr +

అభిమాన తారలకు గుళ్ళు కట్టడం, పూజలు చేయడం సహజం. అభిమాన సంఘాల పేరుతో రక్తదాన శిభిరాలు, అన్నదాన కార్యక్రమాలు చేయడం నిత్యం జరుగుతూనే ఉంటది. ఇకపోతే కటౌట్లు, పాలాభీషేకాలు, రక్తాభిషేకాలు కామనే. అయితే ఓ అభిమాని తన అభిమాన నటుడు నటించిన సినిమా హిట్ కావాలని ఓ భారీ సాహసమే చేశాడు. అభిమాని చేసిన సాహసంకు ఫిదా అయిన అభిమాన నటుడు ఎమోషనల్ అయ్యారు.

ఇప్పుడు ఆ అభిమాని చేసిన సాహసం చూస్తే ఎవ్వరైనా ఔరా అనాల్సిందే. అంతటి సాహసంకు ఒడిగట్టింది ఎక్కడో కాదు తిరుపతిలో. అభిమాన నటుడు ఎనర్జీటిక్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయవంతం కావాలని తిరుపతి కొండను మోకాళ్ళపై ఎక్కి తన మొక్కు తీర్చుకున్నాడు. ఇంత పిచ్చి అభిమానంతో అందరి మనసులు చూరగొన్నాడు ఈ అభిమాని సందీప్.

సందీప్ అనే అభిమాని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా, చార్మీ నిర్మాణంలో ఈనెల 18న విడుదల కాబోతున్న చిత్రం ఇస్మార్ట్ శంకర్. ఈ సినిమా ఘన విజయం సాధించాలని తిరుపతి కొండపైకి మోకాళ్ళతో ఎక్కాడు. అక్కడ తిరుపతి వెంకన్నను దర్శనం చేసుకున్నాడు. తన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టు చూసిన రామ్ ఎమోషనల్గా స్పందించాడు. డియర్ సందీప్ నీ వీడియో చూసాను.. ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉందని ఆశిస్తున్నా… నీ ప్రేమ నా హృదయాన్ని తాకింది. బాధించింది… షాక్ కు గురి చేసింది… మీరు ఇంత ప్రేమ, అభిమానం నాపై చూపించడానికి అంతగా నేనేం చేసానో అర్థం కావడం లేదు…కానీ మీ లాంటి వారి కోసం నా గుండె కొట్టకుంటూనే ఉంటుంది. అని రాసాడు… ఇక చార్మీ అయితే నువ్ నన్ను ఏడిపించావ్ సందీప్ అంటూ కామెంట్ పెట్టింది.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Share.