మెగాస్టార్ చిరంజీవి హీరోగా, తన కొడుకు నిర్మాతగా నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించడం విశేషం. ఇక రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే, చిరంజీవి తోకాజల్ నటిస్తోంది. ఈ సినిమాకి డైరెక్టర్ గా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై మెగా అభిమానులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఇదిలా ఉండగా ఈ సినిమా భారీ బిజినెస్ ను జరుపుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నది.
థియేటర్లో భారీ బిజినెస్ జరుపుకున్న ఆచార్య సినిమా ఒక ఓటీటీ సంస్థ తో కూడా డీల్ కుదుర్చుకున్నట్లు గా తెలుస్తోంది. ఈ సినిమాను దిగ్గజ సంస్థ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో వారితో డీల్ కుదుర్చుకున్నట్లు గా తెలుస్తోంది. థియేటర్ లో విడుదలైన కొన్ని వారాలకే ఈ సినిమా ఓటీటి లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా మణిశర్మ అందిస్తున్నాడు. ఇక అమెజాన్ ప్రైమ్ సంస్థ కూడా ఈ సినిమా కోసం భారీ ఇ మొత్తాన్ని ఖర్చు చేసినట్లుగా సమాచారం.