నేడు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్య నందా పుట్టినరోజు. నేడు అగస్త్య 21వ పడిలోకి అడుగు పెట్టాడు. ఈ సందర్భంగా అతనికి కుటుంబ సభ్యుల నుంచి, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అగస్త్య కు తన సోదరి నవ్య నవేలి, మేనమామ అభిషేక్ బచ్చన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ క్రమంలోనే చిన్నప్పుడు అగస్త్య పూజలో కూర్చున్న చిన్ననాటి ఫోటో ని షేర్ చేసుకున్నాడు అభిషేక్ బచ్చన్.21వ హ్యాపీ బర్త్డే అగస్త్య. దయ, ప్రేమ, కేరింగ్, బాధ్యతాయుతమైన మనిషి గా ఎదగాలని కోరుకుంటున్నా.
ఇప్పుడు నువ్వు అధికారికంగా పెద్దవాడివి దయచేసి ఇకనైనా మా బట్టలు వేసుకోకుండా సొంతంగా కొనుక్కో లవ్ యూ అంటూ పోస్ట్ చేశారు.అలాగే అగస్త్య సోదరి నవ్య నవేలి నందా తన సోదరుడికి సోషల్ మీడియాలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. వారిద్దరూ కలిసి ఉన్న చిన్నప్పటి ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంటూ ‘ 21 ఏళ్లుగా నువ్ నా గదిలోకి వచ్చి, నావైపు మౌనంగా చూసి వెళ్లి పోతావు’. రాసుకొచ్చింది. అలాగే అగస్త్య తల్లి శ్వేత బచ్చన్ కూడా తన శుభాకాంక్షలు తెలిపారు.