బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ షో గుర్తింపు తెచ్చుకున్న వారిలో అదిరే అభి కూడా ఒకరు. చాలామంది జబర్దస్త్ షో నుంచి సినిమాల్లోకి వెళ్లిన సంగతి తెలిసిందే.. అయితే అందులో అభి కూడా సినిమాల్లో అవకాశాలను అందుకున్నాడు. అయితే తనకు ఎంతో గుర్తింపు తెచ్చినటువంటి జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పినట్లు ఈమధ్య వార్తలు కూడా వచ్చాయి. జబర్దస్త్ నుండి బయటకు వచ్చిన అభి స్టార్ మా లో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ అనే షోలో సందడి చేశాడు. అక్కడ కూడా తన కామెడీతో ఫుల్ గా నవ్వించాడు. ప్రస్తుతం అభి బుల్లితెరకు దూరంగా ఉంటూ వెండితెరకు చేరువగా ఉన్నాడు
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో అదిరే అభి పాల్గొని జబర్దస్త్ అనసూయ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. అయితే యాంకర్ ఇలా ప్రశ్నించింది.. అనసూయ, రష్మీలకి జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్ టీమ్స్ ఎలా డివైడ్ చేశారు అని అడిగింది. అప్పుడు అభి జబర్దస్త్ కు మొదట అనసూయ యాంకర్ గా చేసింది..ఆ తర్వాత కొన్ని రోజులకు వేరే పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చింది అప్పుడు రష్మీ వచ్చింది.
ఇక రష్మీ వచ్చినప్పటికీ ఎక్స్ట్రా జబర్దస్త్, జబర్దస్త్ రెండు వచ్చాయి అప్పుడు రెండు షోలని కూడా రష్మీ నే హ్యాండిల్ చేసేది.. కానీ ఎప్పుడైతే అనసూయ వచ్చిందో అప్పుడు జబర్దస్త్ అనసూయకు, ఎక్స్ట్రా జబర్దస్త్ రష్మీకి ఇచ్చారు. ఆ తర్వాత అనసూయ జబర్దస్త్ నుండి ఎందుకు వెళ్లిపోయారు అని అడగ్గా నాకు తెలిసి తను మెటర్నిటీ కోసమే వెళ్ళిపోయారు.. బయట చాలా రూమర్స్ వినిపిస్తున్నాయి అవేవీ నిజం కాదు. రాసుకునే వాళ్ళు ఎలాగైనా రాసుకుంటారు. కానీ అనసూయ మాత్రం మెటర్నిటీ కోసమే వెళ్ళింది అంటూ చెప్పారు అభి..