ప్రముఖ యువ హీరో శర్వానంద్ ఇటీవల అన్ని వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఇకపోతే తాజాగా నాగ శౌర్య హీరో గా లక్ష్య సినిమా ఈనెల 10వ తేదిన ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి ఘనంగా జరిపారు.ఈ ఈవెంట్ కు హాజరైన ముఖ్య అతిథులలో ఒకరైనా శర్వానంద్ మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముందుగా జై బాలయ్య అని చెప్పి.. అఖండ సినిమాతో ఆయన మళ్లీ థియేటర్స్ కి పూర్వవైభవం తీసుకువచ్చారు.. ఒక మంచి సినిమా మొదలైంది.. అందుకే తెలుగు ప్రేక్షకులకు నేను నా ధన్యవాదాలు చెబుతున్నాను.. అంతేకాదు పుల్లెల గోపీచంద్ వంటి గ్రేట్ నేషనల్ ప్లేయర్ తో కలిసి ఈ స్టేజ్ పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటూ తెలిపాడు.
దర్శకుడు సంతోష్ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇక ఆ కష్టం స్క్రీన్ పైన కనిపిస్తుంది.. ఈ సినిమా నిర్మాతలు కూడా నాకు చాలా పెద్ద అన్నదమ్ముల లాంటి వారు.. నా మంచి కోరుకునే వ్యక్తులలో వీళ్లు కూడా ఒకరు . నిర్మాత సునీల్ లవ్ స్టోరీతో పెద్ద హిట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాతో నాగసౌర్య కు పెద్ద హిట్ ఇచ్చారు.. ఈ సినిమా హిట్టవుతుందనే విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ముఖ్యంగా నేను ఒకవేళ ఇలాంటి సినిమా తీయాలి అంటే.. నాకు చాలా ధైర్యం కావాలి ముఖ్యంగా స్పోర్ట్స్ ఫిలిం సినిమా చేయాలి అంటే ధైర్యం ఉండాలి. ఇక అలాంటి ధైర్యము కాన్ఫిడెంట్ నాలో కలిగినప్పుడు కచ్చితంగా నేను కూడా స్పోర్ట్స్ బేస్డ్ ఫిలిం తీస్తాను అంటూ ఆయన తెలిపారు. అంతేకాదు ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరులే , ఓకే ఓకే జీవితం తర్వాత నాగశౌర్య లాగా నేను కూడా సిక్స్ ప్యాక్ తెచ్చుకుంటాను. ఆ తర్వాతనే సినిమా చేస్తాను. నాగ శౌర్య నే నాకు ఇన్స్పిరేషన్ అని తెలిపాడు.