సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా ఎన్టీఆర్ నిర్వహిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కి హాజరైన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇకపోతే ఈ ఎపిసోడ్ కోసం ఎదురు చూసిన అభిమానులకు నిన్న రాత్రి జెమినీ టీవీలో ప్రసారం అయింది . ఒకవైపు హోస్ట్‌గా ఎన్టీఆర్, మరొకవైపు చీఫ్ గెస్ట్ గా మహేష్ బాబు ఇద్దరూ కలిసి ఒకే వేదికపై చాలా సందడి చేశారు.. సెట్లోకి అడుగు పెడుతూనే.. మహేష్ బాబు సెట్ చాలా బాగుంది.. ఇలాంటి గేమ్ షోలకు నేను ఎప్పుడూ వెళ్ళలేదు.. ఫస్ట్ టైమ్ నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఈ షో కి వచ్చాను అంటూ ఎన్టీఆర్ తెలిపాడు.
ఈ షో ద్వారా గెలుచుకున్న ప్రతి రూపాయి కూడా ఛారిటీకి వెళ్తుందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశాడు. ఎన్టీఆర్ , మహేష్ బాబుల మధ్య ప్రశ్నలు, సమాధానాలు నడుస్తూనే వాటికి సంబంధించి పలు ఆసక్తికరమైన సంభాషణలు కూడా జరిగాయి. అంతేకాదు త్వరలోనే ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ మూవీ చేస్తానని మహేష్ బాబు తెలిపాడు. ఎట్టకేలకు ఎన్టీఆర్ వల్ల బుల్లితెరపై దర్శనమిచ్చాడు మహేష్ బాబు.