కరోనా వచ్చినప్పటి నుంచి.. ముఖ్యంగా అందరూ ఉపాధి మీద దెబ్బకొట్టింది. సినీ ఇండస్ట్రీలో అయితే కోలుకోలేని దెబ్బ పడింది. నటీనటులు సహా కార్మికులకు సరైన అవకాశాలు లేకపోవడంతో పలువురు రకరకాలుగా ఇతర ఉపాధి మార్గాలను ఎంచుకున్నారు. అలా ఇప్పుడు హాస్యనటుడు రఘు కారుమంచి ఎంచుకున్న ఉపాధి ఏమిటంటే.. తన స్నేహితులతో కలసి అతడు ఒక మద్యం వ్యాపారంలో అడుగుపెట్టాడు.
మద్యం వ్యాపారంలో అనుభవం ఉన్న కొంతమంది స్నేహితులతో తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మద్యం దుకాణాల వేలం లో పాల్గొని రెండు మద్యం షాపులను దక్కించుకున్నారు. ఒకటి నల్గొండ సరిహద్దుల్లో మర్రిగూడ బైపాస్ వద్ద అభినవ్ లిక్కర్ పేరుతో వీరంతా దుకాణం తెరిచారు. మొన్నటి రోజున ఈ లిక్కర్ షాప్ ను ప్రారంభించారు. నటుడు రఘు తన మద్యం దుకాణం లో కౌంటర్ల నిలిచి అమ్మకాలు కొనసాగిస్తున్న ఫోటో వైరల్ గా మారింది.
రఘు మొదట సాఫ్ట్ వేరే ఇంజనీర్ అట, ఆ తర్వాత నటుడు అయ్యాక తన కెరియర్ లో బిజీగా మారిపోయాడు. కానీ సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేక పోయాడు.ఆ తర్వాత జబర్దస్త్ లో టీం లీడర్ గా కూడా చేశాడు. కానీ ఆ తర్వాత దానిని కూడా వదిలేసి ఇప్పుడు మద్యం దుకాణం తెరిచారు.