బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ తన రేంజ్ ను మరింత పెంచుకున్నాడు అని చెప్పవచ్చు. ఆయన వరుసగా పాన్ ఇండియా సినిమాలో నటించడమే కాకుండా టాలెంటెడ్ డైరెక్టర్ లకు అవకాశం ఇస్తూ తన కెరీర్ ను కొనసాగిస్తున్నారు. ప్రభాస్ సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిత్వం విషయంలో కూడా ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే తాజాగా ప్రభాస్ చేసిన పనికి ఆదిపురుష్ టీమ్ అంతా ఫిదా అవుతోంది. ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా లో ప్రభాస్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తయింది.
ఇక ఈ సందర్భంగా ప్రభాస్ ఖరీదైన రాడో రిస్ట్ వాచెస్ ను చిత్ర బృందానికి బహుమతిగా అందించారు. అయితే ఈ విషయాన్ని ఆదిపురుష్ టెక్నికల్ టీం కు చెందిన ఒక సభ్యుడు సోషల్ మీడియా ద్వారా ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రభాస్ ఇలా బహుమతులు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు.. ఇదివరకే తన దగ్గర పనిచేసే జిమ్ ట్రైనర్ కు 73 లక్షల రూపాయల ఖరీదు చేసే రేంజ్ రోవర్ కార్ ను కూడా గిఫ్ట్ గా అందించారు.