సాధారణంగా తలకి పాగా, చేతికి దారాలు, వేళ్లకు ఉంగరాలు చూడగానే ముందుగా మనకి ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ గుర్తుకువస్తాడు. ఇక ఆయన ఎక్కువగా దేవత, దెయ్యాలకు సంబంధించిన సినిమాలు తీస్తారని అందుకే పూజారుల దగ్గర మంత్రించిన తాయత్తులు, ఉంగరాలు ధరిస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్న వార్త ఏమిటంటే బాలయ్య బాబు విజయం సాధించడానికి కారణం ఆయన మంత్రించిన ఉంగరం పెట్టుకోవడం వల్ల అని కొంతమంది చెబుతున్నారు . ఇంతకు ఈ ఉంగరం వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అఖండ సినిమా విడుదలైన పది రోజుల్లోనే ఏకంగా రూ.100కోట్ల కలెక్షన్స్ ను సాధించి రికార్డ్ సృష్టించింది.
స్టార్ హీరో బాలయ్య జాతకాలను ఎక్కువగా నమ్ముతారనే సంగతి తెలిసిందే. అయితే అఖండ సక్సెస్ కావాలని బాలయ్య తన బొటనివేలికి మంత్రించిన ఉంగరం ధరించారని తెలుస్తోంది. ఈ ఉంగరం వల్ల తనకు కలొసొచ్చిందని బాలయ్య నమ్ముతున్నారని సమాచారం. 2019 సంవత్సరంలో ఏపీలో తెలుగుదేశం పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయినా బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచారు.రోజురోజుకు వయస్సు పెరుగుతున్నా బాలయ్యకు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.