ఆరోజు నన్ను చూసి తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి అంటున్న రాశిఖన్నా..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

రాశికన్నా.. అక్టోబర్ లో విడుదలైన ఆర్య , రాశి ఖన్నా ల హార్రర్ కామెడీ సినిమా అరణ్మ్ నై 3.. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ప్రశంశలు అందుకుంది. ఇక ఈ చిత్రం తమిళంలో విడుదల అయింది.. గంగ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని ఇప్పుడు అంతః పురం పేరుతో తెలుగులో ప్రేక్షకుల ముందుకు త్వరలోనే తీసుకొస్తోంది. రెడ్ జెయింట్ మూవీస్ ఉదయనిధి స్టాలిన్ , అవని సినీ మాక్స్ ప్రైవేట్, బెంజ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పణలో ఈ సినిమా డిసెంబర్ 31వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇకపోతే అరుణ్మ నై 1.. తెలుగులో చంద్రకళ గా రాగా..అరుణ్మ నై 2 కళావతి గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.అరుణ్మ నై 3 తాజాగా అంతఃపురం సినిమా గా విడుదల కాబోతోంది.

Aranmanai 3' review: A horror-comedy that takes too many detours and ends up directionless - The Hindu
అయితే ఈ సినిమాకు తమిళంలో మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో రాశిఖన్నా పాత్ర గురించి మాట్లాడితే.. ఆమె కెరియర్ లో మొదటిసారి ప్రేక్షకులను భయపెట్టే విధంగా ఈ పాత్రను సెలెక్ట్ చేసుకున్నారని చెప్పవచ్చు.. ఒక అంతఃపురం లో జరిగే సన్నివేశాలు కామెడీతో పాటు హార్రర్ యాంగిల్ లో నడుస్తాయని దర్శకుడు తెలిపాడు.. ఇకపోతే తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చే అంశాలు ఈ చిత్రంలో ఉన్నాయని ప్రతి ఒక్క సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని, ఇక నేను భయపెట్టడానికి వస్తున్నా మీరు సిద్ధంగా ఉండండి అంటూ రాశికన్నా వెల్లడించారు.

Share.