బుల్లితెరపై యాంకర్ వర్షిని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు..హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకొని ఢీ షో ద్వారా బాగా పాపులర్ అయింది. ఇందులో రష్మీ తో కలిసి ఈమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.. షో కి మరింత గ్లామర్ తీసుకొచ్చి ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇక జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కి జోడిగా వర్షిని ఎంతో సందడి చేసింది. కానీ ఏమైందో తెలియదు కానీ ఢీ నుంచి తప్పుకొని మా టీవీలో ప్రసారమయ్యే కామెడీ స్టార్స్ లో యాంకర్ గా కొన్ని రోజులు సందడి చేసింది. ఇక తరువాత వెండి తెరపై కూడా కొన్ని చిత్రాలలో నటించింది ఈ ముద్దుగుమ్మ..
ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తనకు ఎదురైన చేదు అనుభవాలను వెల్లడించింది.. ఆమె మాట్లాడుతూ.. నేను ఎప్పుడూ కూడా బుల్లితెర పైకి రావాలని అనుకోలేదు.. కానీ మోడలింగ్ చేసే సమయంలో అవకాశాలు వచ్చాయి. అందులో మంచి అవకాశాలను అందిపుచ్చుకుని.. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటూ తెలిపింది. ఈ స్థానానికి రావడానికి ఎన్నో అవమానాలు , బాధలను కూడా పడ్డాను అని తెలిపింది వర్షిని. ఈ క్రమంలోనే టాలీవుడ్ కి చెందిన ప్రముఖ డైరెక్టర్ నాకు సినిమా ఛాన్స్ ఇస్తానని చెప్పి.. అగ్రిమెంట్ పైన సైన్ చేయించుకోవడానికి తన ఇంటికి రమ్మన్నాడు..
దీంతో నేను ఆయన ఇంటికి వెళ్లగా.. నాతో దురుసుగా ప్రవర్తించాడు. నా చేయి పట్టుకుని బెడ్ మీదకు లాగాడు
. దాంతో నేను కోపంతో అతని చెంప పగలగొట్టి అక్కడి నుంచి వెళ్లి పోయాను అంటూ ఎమోషనల్ అవుతూ వర్షిని తెలిపింది.