అల్లు అర్జున్ కి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇక పుష్ప సినిమాతో ఆ క్రేజ్ మరింత రెట్టింపు పెరిగింది. ఇప్పుడు పుష్ప-2 షూటింగ్లో అల్లు అర్జున్ బిజీగా గడిపేస్తున్నాడు. అయితే తాజాగా ఓ వార్త పెద్ద ఎత్తున వైరల్ గా మారుతోంది. అదేమిటంటే బాలీవుడ్ లో అల్లు అర్జున్ ఒక మూవీ లో ఒక గెస్ట్ రోల్ చేస్తున్నాడు అనే వార్త వినిపిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళ స్టార్ దర్శకుడు అట్లీ.. ప్రస్తుతం షారుక్ ఖాన్ తో జవాన్ అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో హీరోయిన్గా నయనతార నటిస్తోంది.
అంతేకాకుండా ఈ సినిమాలో విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కోసం అల్లు అర్జున్ ని సంప్రదించాడట దర్శకుడు అట్లి. అంతేకాకుండా అల్లు అర్జున్ కి కథ వినిపించి ఆ సినిమాలో ఆయన పాత్ర గురించి కూడా చెప్పాడట కానీ అల్లు అర్జున్ మాత్రం ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదనీ తెలుస్తోంది..అయితే అల్లు అర్జున్ కి నార్త్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. పుష్ప సినిమాకి రూ .100 కోట్ల పైనే కలెక్షన్ సాధించింది.
ఒకవేళ అర్జున్ ఈ సినిమా తీసుకుంటే అతని హిందీలో క్రేజ్ తో పాటు తెలుగు, మలయాళం లో కూడా ఎక్కువ మార్కెట్ ఉన్న నటుడు కాబట్టి… జవాన్ కి కలిసొస్తుందని దర్శకుడు భావిస్తున్నట్లు వినికిడి.ఇటీవల వచ్చిన పఠాన్ మూవీతో బిగ్గెస్ట్ హిట్లు అందుకున్నాడు. షారుక్ ఖాన్ ఈ మూవీకి రూ .1000 కోట్ల వసూలు దిశగా దూసుకుపోతోంది. కాబట్టి జవాన్ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ మూవీలో కనుక అల్లు అర్జున్ నటించిన పుష్ప- 2 సినిమాకి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.