తమిళ హీరో విజయ్ కాంత్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తన తమిళ సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల చేసి మంచి విజయాలను కూడా అందుకున్నారు.దీంతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా విజయ్ కాంత్ కి బాగా సక్సెస్ అందించిన పాత్రలలో పోలీస్ పాత్రలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. పోలీస్ పాత్ర గల సినిమాలు 20 పైగా చిత్రాలలో నటించారు.
ఇక సినిమా రంగం నుండి రాజకీయాల వైపు వెళ్లిన విజయ్ కాంత్ 2005 సెప్టెంబర్ 14న విజయకాంత్ దేశీయ యూరోప్‌కు ద్రావిడ కలగం..DMDK పార్టీని స్థాపించారు. 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగిందట. విజయ్ కాంత్ ప్రస్తుతం రాజకీయాలకు సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఇంట్లోనే ఉంటూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ప్రస్తుతం నడవలేని స్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది తమిళ హీరో విజయ్ తండ్రి చంద్రశేఖర్ గారు కూడా హీరో విజయకాంత్ కి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఇంటికి వెళ్లినప్పుడు ఆయనతో కలిసి దిగిన కొన్ని ఫోటోలు వైరల్ గా మారాయి
ఈ ఫోటోలలో విజయకాంత్ నడవలేని స్థితిలో వీల్ చైర్ లో ఉన్నట్లు తెలుస్తోంది.. ఇక విజయకాంత్ ఆరోగ్య విషయానికి వస్తే చాలా రోజుల నుండి డయాబెటిస్తో బాధపడుతున్నట్లు సమాచారం.అలా ఆయన కాలి తొలగించినట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఆయన నడవలేని స్థితిలో ఉన్నట్లు ఈ ఫోటోలను చూస్తే మనకి అర్థమవుతుంది. డైరెక్టర్ చంద్రశేఖర్ గారికి మొదటి అవకాశం ఇచ్చి కెరియర్లు మంచి విజయాన్ని అందించిన విజయకాంత్ గారికి మంచి అనుబంధం ఉంది. ప్రస్తుతం విజయకాంత్ పరిస్థితి చూసి అభిమానులు సైతం చాలా ఆందోళనలకు గురవుతున్నారు త్వరగా కోలుకోవాలని తెలియజేస్తున్నారు.