సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుస సినిమాలతో ఇండస్ట్రీలో చాలా బిజీగా గడుపుతున్న నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటూ సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇకపోతే గత ఏడాది నయనతార ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అదే ఏడాది సరోగసి ద్వారా ఇద్దరు మగ కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు.
ఇక వివాహం అనంతరం నయనతార మళ్ళీ సినిమాలలో బిజీ అయిపోయింది. ఈ క్రమంలోనే తన భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తో ఒక సినిమా చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. కొన్ని కారణాలవల్ల ఈ సినిమా ఆగిపోయిందని .. విఘ్నేష్ స్థానంలో మరొక డైరెక్టర్ రావడం జరిగింది. ఈ విషయం తెలిసి విగ్నేష్ పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని సమాచారం. ఇకపోతే తన సినిమాకు తన భర్తను ఎంపిక చేసి ఆ తర్వాత సినిమా నుంచి తొలగించడంతో నయనతార ఈ విషయంలో కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం.
తన భర్తను తొలగించడం పై అసహనం వ్యక్తం చేస్తున్న నయనతార తన భర్తను అవమానించిన హీరోతో తాను జీవితంలో సినిమా చేయకూడదని నిర్ణయాన్ని నయనతార తీసుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇకపై అజిత్ తో ఆమె సినిమాలలో నటించకూడదని నిర్ణయం తీసుకుందట. ప్రస్తుతం షారుక్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జవాన్ సినిమాలో ఈమె హీరోయిన్ గా నటిస్తోంది. మరి నయనతార తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.