బాడీ షేప్ పై చీప్ కామెంట్స్ చేశారంటూ ఎమోషనల్ అవుతున్న ప్రముఖ హీరోయిన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇటీవల కాలంలో హీరోయిన్లు ఎన్నో రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.. సాధారణంగా ఏ హీరో హీరోయిన్ ను చూసినా చాలా సంతోషంగా ఉన్నారు కదా అని అనుకోవచ్చు. కానీ రియాల్టీలో మాత్రం అలా ఉండదు.కెరియర్ పరంగా ఎన్నో సమస్యలను వారు ఎదుర్కొంటూ ఉంటారు. కాకపోతే వాటిని ఎప్పుడు బయటపెట్టరు. అందుకే వాటి గురించి మనకు పెద్దగా తెలియదు. కానీ సందర్భం వచ్చినప్పుడు వారు చెబితే మాత్రం అయ్యో అవునా అలా జరిగిందా అంటూ మనం కూడా ఫీలవుతూ ఉంటాం.

Saiyami Kher Wiki, Age, Height, Boyfriend, Family, Biography & More - WikiBio

అయితే అసలు విషయంలోకెళితే.. తెలుగులో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసి జీవితాన్ని కొత్త మలుపు తిప్పుకోవాలని ఆరాటపడిన ఒక హీరోయిన్ కి తన బాడీ షేమింగ్ పై చీప్ కామెంట్స్ చేశారట కొంతమంది. అయితే ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెబుతూ ఎమోషనల్ అయింది. ఇది విన్న పలువురు నెటిజనులు ఇండస్ట్రీపై మరొకసారి విరుచుకుపడుతున్నారు.. అసలు విషయంలోకి వెళ్తే మరాఠీ బ్యూటీ సయామీ ఖేర్ తెలుగులో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. తర్వాత ఇక్కడికంటే హిందీ మరాఠీ భాషల్లోని సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ.

ఇటీవల తెలుగులో నాగార్జున వైల్డ్ డాగ్, ఆనంద్ దేవరకొండ హైవే సినిమాలలో నటించిన ఈమె ఇప్పుడు ఫాదూ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ కెరియర్ ప్రారంభంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను బయటపెట్టింది. తాను కూడా బాడీ షేమింగ్ బారిన పడ్డాను అని చెప్పుకొని ఎమోషనల్ అయింది. అయితే నటిగా తన కెరీర్ ను మొదలుపెట్టినప్పుడు లిప్ అండ్ నోస్ జాబ్ చేయాలని వెటకారంగా మాట్లాడేవారు కానీ నేను దీనిని పట్టించుకునే దాన్ని కాదు.. ఎవరైనా సరే నా శరీరం గురించి మాట్లాడితే చాలా బాధగా ఉండేది. కాస్త మందంగా ఉండడం వల్ల అలాంటి వ్యాఖ్యలకు బాధపడలేదు.

ఎవరైనా చేసే చీప్ కామెంట్లు మరింత బాధగా అనిపిస్తుంది. కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి. సమాజంలో చాలామంది సెన్సిటివ్ పర్సన్స్ ఉన్నారు. మనం ఒకరితో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి . లేకపోతే అవతలి వారు ఎంతో బాధపడతారు అంటూ ఎమోషనల్ అవుతూ తెలిపింది.

Share.