టాలీవుడ్ లో మన్మధుడుగా పేరు సంపాదించిన నాగార్జున ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పలు వ్యాపారాలలో సక్సెస్ అవుతున్నారు. ముఖ్యంగా బుల్లితెరపై బిగ్ బాస్ హోస్ట్ గా మంచి పాపులారిటీ సంపాదించారు. అదేవిధంగా తన కెరీర్లు ఎన్నో వివాదాలకు దూరంగా ఉండే నాగార్జున సోషల్ మీడియా పై వస్తున్న ట్రోల్స్ గురించి ఎప్పుడు రియాక్ట్ కూడా అవ్వలేదు. అయితే ప్రముఖ లాయర్ ఒకరైన కళానిధి నాగార్జున గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో టాప్ లాయర్లలో ఒకరైన కళానిధి నాగార్జునకు గోవాకు సంబంధించిన పంచాయతీ నుంచి వచ్చిన నోటీసు గురించి కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నాగార్జున పీఏ ఒకరోజు తనకి ఫోన్ చేసి నాగార్జున ఫారన్ కారు కొన్నారని ఆ కారును పాండిచ్చేరిలో రిజిస్ట్రేషన్ చేయిస్తే ఏమైనా సమస్య వస్తుందా అని లాయర్ కళానిధిని అడిగారట. అయితే ఆ తర్వాత వెంటనే అక్కినేని వెంకటేష్ ఇంటికి వెళ్లి దారిలో ఆ షెడ్ లో ఉన్న కార్లను చూశానని కళానిధి తెలిపారు. అక్కడ ఎక్కువగా ఫ్యాన్సీ నెంబర్ ల కార్లను చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు.
ఇక నాగార్జున చాలా పొగరు మనిషి అని ఆటోగ్రాఫ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడరని కళానిధి తెలియజేశారు. నాగార్జునకు టెంపర్ ఎక్కువ అని నేను ఫిజికల్ గా చూశానని తెలియజేశారు.టీవీలో కనపరిచే నాగార్జున వేరని బయట కనపడే వేరని.. కోపం నాగార్జునకు చాలా ఉందని కూడా తెలియజేశారు. సినిమా షూటింగ్ సమయంలో నాగార్జునను కలవడానికి నేను స్లిప్పు పంపించానని తెలిపారు. అరగంట ఎదురుచూసిన ఫలితం లేకపోవడంతో అక్కడి నుంచి వచ్చేసానని తెలిపారు. తన కెరియర్ లో ఎంతోమంది సెలబ్రిటీలను చూశాను కానీ నాగార్జున లాంటివాడిని చూడలేదని తెలిపారు.