Rashmika టాలీవుడ్ లో నేషనల్ క్రష్ గా పేరుపొందింది హీరోయిన్ రష్మిక(Rashmika).. మొదట ఛలో సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో కలిసి గీత గోవిందం సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకుంది. ఆ వెంటనే స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది ఈ అమ్మడు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా హీరోయిన్గా పేరు సంపాదించడమే కాకుండా బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలను అందుకుంది. ఇక అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో ట్రోల్ అవుతూ కూడా ఉంటుంది.
ఇక విజయ్ దేవరకొండ తో కలిసి రెండు సినిమాలు నటించడంతో వీరిద్దరి మధ్య ప్రేమ ఉందంటూ పలు రకాలుగా వార్తలు వినిపిస్తుంటాయి. ఇక వరల్డ్ స్లిమ్ డే సందర్భంగా రష్మిక పలు ఆసక్తికరమైన విషయాన్ని పోస్ట్ చేసింది. నిద్ర గొప్పతనం గురించి వివరిస్తూ వాస్తవానికి తాను నిద్రకే మొదటి ప్రాధాన్యత ఇస్తానంటూ తెలియజేస్తోంది. ఈ మేరకు తన ఇంస్టాగ్రామ్ లేదు కదా ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.
జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యమైనదని అందుకే ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో తగినంత సేపు నిద్రపోవాలి అని ఎవరికోసం దేనికోసం నిద్రను త్యాగం చేయకండి అంటు.. ఇది నా లైఫ్ లో నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠం అంటూ అందరికీ చెప్పాలనుకున్నాను కాబట్టి చెబుతున్నాను అంటూ తెలియజేస్తోంది రష్మీక. హ్యాపీ స్లిమ్ డే ఆల్ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది ఈ అమ్మడు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఒక పోస్ట్ వైరల్ గా మారుతోంది.
రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో పుష్ప-2 సినిమా పైన ఈ అమ్మడు ఆశలు పెట్టుకుంది. ఇక అప్పుడప్పుడు గ్లామర్ షోను చేస్తూ కుర్రకారులను బాగా ఆకట్టుకుంటూ ఉంటుంది.
View this post on Instagram