Hema:ఈ వయసులో కూడా అలాంటి పని చేస్తూ రెచ్చిపోయిన హేమ..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

Hema టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి హేమ(Hema) అందరికీ సుపరిచితురాలే..పలు సినిమాలలో ఎన్నో కీలకమైన పాత్రలలో పోషించి కామెడీ చేస్తూ తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది హేమ. అప్పట్లో వెంకటేశు నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో ఎమ్మెస్ నారాయణ భార్యగా కామెడీని పండించి గుర్తుండిపోయింది. ఆ తరువాత “అతడు” లాంటి సినిమాలలో నటించి అభిమానులకు గుర్తుండేలా బ్రహ్మానందం తో కామెడీ చేసింది హేమ. అంతేకాకుండా పలు అగ్ర హీరోల సినిమాలలో నటించి హైలెట్గా నిలిచింది.

హేమ ఒక్క తెలుగులోనే కాకుండా తమిళ్ ,మలయాళం, హిందీ భాషలలో కూడా నటించింది. ఈమె మొట్టమొదటిగా తెలుగు ఇండస్ట్రీకి బాలయ్య చిత్రంతో పరిచయమయ్యింది. 1989లో వచ్చిన భలే దొంగ చిత్రంలో నటించింది.అక్కడి నుంచి దాదాపు 500 సినిమాలకు పైగా నటించింది.

వెండితెరపైనే కాకుండ బుల్లితెరపై కూడా రెండు మూడు సీరియల్స్ లో హేమ కీలక పాత్రలో పోషించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమాకి నంది అవార్డును కూడా అందుకుంది.హేమ ఒక్క సినిమాలే కాదు రాజకీయాల్లోనూ ప్రవేశించింది. ఇదంతా కాస్త పక్కన పెడితే ఇటీవల సినిమాలకు దూరమై చాలావరకు వ్యాపార రంగంలోకి ప్రవేశించింది. అక్కడ కూడా ఆమె విజయవంతంగా రాణిస్తున్నారు.

అయితే లేటెస్ట్ గా తన హస్బెండ్ బర్తడే వేడుకలను స్విమ్మింగ్ ఫూల్ లో చాలా వెరైటీగా నిర్వహించటం జరిగింది. ఆ సమయంలో కేక్ కట్ చేయకముందే తన భర్తకి లిప్ లాక్ ఇచ్చింది హేమ.. అందరూ చూస్తూ వీడియోలు తీస్తున్న టైం లో అలా హేమా చేయడంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Share.