NTR తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలలో ఎక్కువ మంది బంధువులు ఉన్నారు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారే బంధుత్వం కలుపుకుంటూ ఉంటారు. ఇందులో నటుడు వడ్డే నవీన్ కూడా ఒకరు వడ్డే నవీన్ గురించి ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు.కానీ ఒకప్పుడు ఆయన కూడా స్టార్ హీరోగా లవర్ బాయ్ గా పేరు సంపాదించారు. ఆయన మొదట్లో ఎక్కువగా ప్రేమ సినిమాలలో నటించేవారు. లవ్ సినిమా తర్వాత ఫ్యామిలీ సినిమాలలో బాగానే ఆకట్టుకున్నారు.
ఇక వడ్డే నవీన్ తండ్రి నిర్మాత వడ్డే రమేష్. వడ్డే నవీన్ ఒకప్పుడు నందమూరి ఫ్యామిలీలో కూడా ఒకరు. ఇంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్కు (NTR)వరుసకు బావ కూడా అవుతారట. సీనియర్ ఎన్టీఆర్ హయాంలో సినీ పరిశ్రమ ప్రతిభ ఉన్న ప్రతి ఒక్కరి కి కూడా రాజకీయాలలో సినీమాలలో రాణించేవారు. అలా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే వడ్డే నవీన్ ఒక అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి నందమూరి కుటుంబానికి చెందినవారు కావడం విశేషం అని చెప్పవచ్చు.
ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ కూతురు చాముండేశ్వరి వడ్డే నవీన్ ప్రేమించుకున్నారట. ఆ తర్వాత వీరి విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వీరు సంబంధాన్ని కుదిరించారని వార్తలు వినిపించాయి. ఎట్టకేలకు వడ్డే నవీన్ చాముండేశ్వరి వివాహం చేసుకున్నారు. అలా వడ్డే నవీన్ ఎన్టీఆర్కు బావ అయ్యారు అయితే కొన్ని కారణాల చేత వడ్డే నవీన్ చాముండేశ్వరి విడిపోవడం జరిగింది. మరొకవైపు వడ్డే నవీన్ కు కూడా అవకాశాలు తగ్గిపోయాయి. ఎంత శ్రమించిన అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా పలు సినిమాలలో నటించారు. అవి కూడా సక్సెస్ కాలేకపోవడంతో సినిమాలు మానేశారు.