Ram Charan:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలిన చిత్రం ఒక మచ్చగా మిగిలిన చిత్రం ఏమిటంటే ఆరెంజ్. ఈ సినిమా చరణ్ ఎందుకు చేశారా అంటూ ప్రతి ఒక్కరు కూడా ఆవేదనని వ్యక్తం చేశారు. మగధీర వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత రామ్ చరణ్(Ram Charan) నుండి ఆరంజ్ సినిమా విడుదలవ్వడం జరిగింది.. మగధీర సినిమా రూ .100 కోట్ల రూపాయలను వసూలు చేయక ఆ తర్వాత ఆరంజ్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని చవిచూసింది. దీంతో రామ్ చరణ్ కెరియర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది.
ఆరంజ్ సినిమా గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత ఉత్తమమని అభిమానులు భావిస్తూ ఉంటారు. అలాంటి ఆరంజ్ సినిమా రీ రిలీజ్ చేయడానికి చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నారు. దీంతో అభిమానులు అంతా కూడా ఆందోళన చెందుతున్నారు. మగధీర సినిమాను రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావించగా కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాను కాకుండా ఆరంజ్ సినిమాని విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఈ నిర్ణయం మాత్రం సరి కాదని ఇది రామ్ చరణ్ అవమానించడమే ఆంటు కొంతమంది అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల రాంచరణ్ కు ఉన్న ఫ్యాన్ ఫాలో తగ్గిపోతుందని కొంతమంది తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో ఒక భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు ఈ సినిమాని దిల్ రాజు నిర్మాణంలో నిర్వహిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.