Srinidhi Shetty:దేశవ్యాప్తంగా క్రేజీను సంపాదించుకున్న మూవీ కేజిఎఫ్ బాహుబలి సినిమా తర్వాత ఈ మూవీనే పాన్ ఇండియా వైడ్గా పాపులారిటీని సంపాదించుకుంది.కేజిఎఫ్ మూవీ ఏ రేంజ్ లో సక్సెస్ ని సాధించిందో తెలిసిందే.ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఈ సినిమా మాస్ యాక్షన్ మూవీకి ఒక ట్రెండ్ సెంటర్ గా నిలిచింది.ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశాడు.ఇందులో హీరోగా కన్నడ యాక్టర్ యష్ హీరోయిన్గా శ్రీనిధి శెట్టి నటించారు. ఈ సినిమాతో వీరిద్దరూ పాన్ ఇండియా వైడ్ ఫేమ్ అయ్యారు.
కాగా ఇటీవల ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ ఉమైర్ సంధు శ్రీనిధి ఫోటో పెట్టి ఆమె చెప్పినట్లు ఒక సంచలన ట్విట్ చేశాడు.కేజిఎఫ్ సెట్లో యష్ తో పనిచేయటం చాలా ఇబ్బందిగా అనిపించిందని. తను నన్ను వేధించాడు తనతో కలిసి మళ్ళీ ఇంకో సినిమా చేయను అంటూ చెప్పుకొచ్చినట్లు ఉమైర్ ట్విట్ చేశాడు. ఈ ట్విట్ పై యముడు స్పందించింది.
చాలామంది సోషల్ మీడియా వేదికను దుర్వినియోగం చేస్తున్నారు. చెడుని వ్యాప్తి చేయటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నేను ఆ వేదికను ప్రేమ మరియు ఆనందాన్ని వ్యాప్తి చేయటానికి ఉపయోగిస్తుంటాను. ఈ నేపథ్యంలోనే నేను మీకు చెప్పాలి అనుకుంటుంది. ఏంటంటే.. కేజిఎఫ్ వంటి అద్భుతమైన సినిమాని తెరకెక్కించేటప్పుడు నాకు రాకింగ్ స్టార్ యష్ తో కలిసి పని చేయడం హ్యాపీగా అనిపించింది. అంతేకాకుండా ఎంతో గౌరవం కూడా దక్కింది. అతను చాలా మంచి మనిషి ఆయనే నాకు గురువు ఇన్స్పిరేషన్ నేను ఎప్పటికీ ఆయన అభిమానినే అంటూ ఒక వార్తలు రిలీజ్ చేసింది. ఆయన పెట్టిన కామెంట్స్ నిజం కాదని కరాకండిగా చెప్పేసింది. ప్రస్తుతం శ్రీనిధి షేర్ చేసిన ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతోంది.
🌸🙏🏻🤗@TheNameIsYash ⭐️ pic.twitter.com/iAo6xCJjU1
— Srinidhi Shetty (@SrinidhiShetty7) March 16, 2023