Rana.. పాన్ ఇండియన్ స్టార్ హీరో రానా (Rana)దగ్గుపాటి విక్టరీ వెంకటేష్ తండ్రి కొడుకులుగా నటించిన తాజా వెబ్ సిరీస్ రామానాయుడు. ప్రముఖ ఓటీటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రిమ్మింగ్ అవుతోంది. ఈ సిరీస్ కు మంచి రెస్పాన్స్ కూడా లభించింది. గత కొద్దిరోజులుగా ఈ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా బిజీగా ఉన్నారు రానా. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలియజేశారు.
రానా మాట్లాడుతూ తన కార్నియల్ కిడ్నీ మార్పిడి గురించి కూడా తెలియజేశారు తన కుడి కన్ను అసలు కనిపించదని తన పాక్షికంధత్వాన్ని ఎలా ఎదుర్కొన్నాడనే విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. రానా మాట్లాడుతూ కార్నియల్ ట్రాన్స్ ప్లాంట్ గురించి మాట్లాడిన అతి కొద్ది మందిలో నేను కూడా ఒకడిని.. నేను నా కుడి కన్ను చూడలేను కిడ్నీ మార్పిడి కూడా జరిగిందని తెలియజేశారు. చాలామంది శారీరక సమస్యలు వస్తే బాధపడుతూ ఉంటారు. కొన్నాళ్లకు ఆ ప్రాబ్లం క్లియర్ అయిన ఫీల్ అవుతూనే ఉంటారని తెలిపారు.
అంతేకాకుండా ఆ ఆలోచనల నుంచి బయటకు వెళ్లి ముందుకు వస్తే కానీ మన అసలైన జీవితం ఉంటుందని తెలిపారు రానా. 2016లో మేము సైతం అనే కార్యక్రమంలో రానా మొదటిసారి తన కంటి సమస్య గురించి బయట పెట్టడం జరిగింది. ఇక తనకు కుడి కన్ను కనిపించదని చిన్నతరంలోనే ఎల్ వి ప్రసాద్ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్ జరిగిందని ఆ సమయంలో వైద్యులు తనకు ఎంతో ధైర్యం చెప్పారని కూడా తెలియజేశారు రానా.
అలా తన జీవితంలో ఎదురైన దుఃఖాలన్నిటిని ఏదో ఒక రోజు దూరం అవుతాయని ఎప్పుడూ సంతోషంగా ఉంటూ కుటుంబాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు రానా. ప్రస్తుతం రానా హీరోగా పలు చిత్రాలలో నటిస్తున్న సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు. దీంతో సరైన కథ దొరికితే ఆచితూచి అడుగులు వేస్తూ సినిమాని మొదలు పెట్టాలని చూస్తున్నారు రానా.