ప్రముఖ ఆస్ట్రాలజర్ గా పేరు సంపాదించుకున్న వేణు స్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించి.. వారి జాతకాలను బయటపెడుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాడు. ఇకపోతే ఇప్పటివరకు హీరోయిన్ల జాతకాలు చెబుతూ అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన ఈయన ఇప్పుడు హీరోల పైన కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు. ఇదిలా ఉండగా ప్రపంచవ్యాప్తంగా భారీ పాపులారిటీ దక్కించుకున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలోని పాట ఏకంగా ఆస్కార్ అవార్డును సైతం సొంతం చేసుకుంది.
ముఖ్యంగా ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు, రామ్ చరణ్ నటనకు ఫిదా అవని వారంటూ లేరనడంలో సందేహం లేదు. ఇకపోతే కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటించగా.. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించి.. ప్రేక్షకులను అలరించారు. ఇదిలా ఉండగా ఇద్దరూ సమానంగా నటించినప్పటికీ కొంతమంది ఎన్టీఆర్ నటన బాగుంది అంటే మరికొంతమంది రామ్ చరణ్ నటించిన బాగుంది అని రకరకాలుగా కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. అయితే మరికొంతమంది రామ్ చరణ్ ను హైలెట్ చేస్తూ ఎన్టీఆర్ ను ఈ సినిమాలో తొక్కేసారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి
అందుకు తగ్గట్టుగానే ఒక హాలీవుడ్ రిపోర్టర్ కూడా ఎన్టీఆర్ సైడ్ క్యారెక్టర్ లో నటించారు అంటూ సంచలన కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత చిట్టిబాబు కూడా ఇటీవల ఒక ఛానల్లో జరిగిన డిబేట్లో పాల్గొని ఆ రిపోర్టర్ ఎన్టీఆర్ ది సైడ్ క్యారెక్టర్ అంటూ చెప్పాడని నొక్కి మరీ తెలిపాడు. అయితే ఇప్పుడు వేణు స్వామి కూడా ఎన్టీఆర్ ది సైడ్ క్యారెక్టర్ అంటూ సంచల కామెంట్లు చేయడం మరింత వైరల్ గా మారుతోంది. సంక్రాంతి సినిమాలో శ్రీకాంత్ క్యారెక్టర్ లోగా ఎన్టీఆర్ నటించారు.. వెంకటేష్ పాత్రలో రామ్ చరణ్ అయితే శ్రీకాంత్ క్యారెక్టర్ లో ఎన్టీఆర్ నటించారు అంటూ మరొకసారి సంచలనానికి దారి తీశాడు వేణు స్వామి . అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారుతోంది.
చూసావా తాత.. ప్రతి వాడు సైడ్ character అంటున్నాడు.. 🥺🥺pic.twitter.com/1feGx0nYIU
— Sᴀɱ JօղVíƙ™ (@Sam_Jonvik2) March 16, 2023