టాలీవుడ్లో హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎప్పుడు సాదాసీదా లాగా ఉండే ఈ అమ్మడు ఈమధ్య కాలంలో కాస్త గ్లామర్ డోస్ పెంచిందని చెప్పవచ్చు. ఇక ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించిన శ్రియ .రజనీకాంత్ ను చూసి పలు విషయాలు నేర్చుకోవాలని తెలియజేస్తోంది శ్రియ. ఇక తాజాగా ఉపేంద్ర సరసన కబ్జా సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా రేపటి రోజున చాలా గ్రాండ్ గా విడుదల కాబోతున్నది. ఈ సినిమా సందర్భంగా ప్రమోషన్లలో పాల్గొనింది శ్రియ.
శ్రియ మాట్లాడుతూ.. తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. కబ్జా సినిమా తన మనసుకు బాగా నచ్చిన సినిమా అని ఈ చిత్రంలో తనకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు స్పెషల్ థాంక్స్ అంటూ తెలుపుతోంది. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తో నటించే అవకాశం కల్పించిన డైరెక్టర్ శంకర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానంటూ తెలిపింది. నిజానికి రజనీకాంత్ గారితో నటించే సమయంలో వ్యక్తిత్వంగా చాలా విషయాలు నేర్చుకున్నానని నేను కూడా విజయాన్ని తలకు ఎక్కించుకోకుండా సాదాసీదా గా ఎలా ఉండాలో ఆయనను చూసి నేర్చుకున్నాను అని తెలిపింది.
అవకాశం దొరికితే రజినీకాంత్ గారితో మరొక సినిమా చేయాలని ఆశపడుతున్నాను నాకు ఎప్పటికీ ఆయనే సూపర్ స్టార్ అంటూ తన మనసులో మాటను బయట పెట్టడం జరిగింది శ్రియ. ప్రస్తుతం శ్రియ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ మధ్యకాలంలో హీరోయిన్గా ఏ సినిమాలో కూడా అవకాశాలు రాలేదు కేవలం పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు పాత్రలో నటిస్తోంది శ్రియ.