నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరియర్ పరంగా చాలా స్పీడ్ గా దూసుకుపోతున్నారు. అఖండ, వీర సింహారెడ్డి వంటి బ్లాక్ బాస్టర్ విజయాలతో పాటు ఆన్ స్టాపబుల్ షో తో మంచి పాపులారిటీ సంపాదించారు. ఇప్పుడు డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న సినిమా పైన కూడా టాలీవుడ్ లో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. బాలయ్య కెరియర్ లోనే ఎంతోమంది హీరోయిన్లతో ఎన్నో సినిమాలలో నటించారు.
గతంలో విజయశాంతి, సిమ్రాన్, భానుప్రియ తదితర హీరోయిన్లతో రిపీట్ గా సినిమాలు చేశారు బాలయ్య. విజయశాంతితో బాలయ్య ఎక్కువగానే సినిమాలలో నటించేవారు.వీరిద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ ఉన్నట్లుగా కూడా గతంలో వార్తలు వినిపించాయి. వీరిద్దరి కాంబినేషన్లు ఏకంగా 17 కు పైగా సినిమాలు వస్తే అందులో ఎక్కువ సినిమాలు సూపర్ హిట్టుగా నిలిచాయి. అయితే బాలయ్య కి ప్రారంభంలో ఒక హీరోయిన్ తో ఎఫైర్ ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి ఆ హీరోయిన్ ఎవరో కాదు తమిళ హీరోయిన్ ఖుష్బూ.
అప్పట్లో బాలయ్య చెన్నైలో ఉండడంతో ఖుష్బూతో ఏర్పడిన పరిచయం కారణాం చేత వీరిద్దరూ షూటింగ్ అయిపోయిన వెంటనే చటాపటాలు వేసుకొని తిరిగే వారిని సమాచారం.ఆ సమయంలోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజలలో తిరుగుతూ ఉండేవారు. బాలయ్య ఖుష్బూని వివాహం చేసుకుంటానని చెప్పడంతో ఆగ్రహించిన ఎన్టీఆర్ వెంటనే కాకినాడకు చెందిన వసుంధర తో బాలయ్య పెళ్లి చేశారు. వివాహం తర్వాత బాలయ్య ఖుష్బూ బంధం కొనసాగేదట. ఈ విషయం వసుంధరకు తెలియడంతో భర్తను మార్చేందుకు ఎన్నోసార్లు సర్ది చెప్పిందట. అయితే బాలయ్య ,వసుంధర మాట ఏమాత్రం లెక్క చేయలేదు. ఈ విషయాన్ని వెంటనే ఎన్టీఆర్ వద్దకు వెళ్లి చెప్పి కన్నీళ్లు పెట్టుకోవడంతో.. బాలయ్యను పిలిపించిన ఎన్టీఆర్ ఆ తర్వాత నుంచి ఖుష్బూ వైపు చూడడం మానేశారట. దీంతో ఈ విషయం అప్పట్లో తెగ బహిరంగ మారింది.