బాహుబలి సినిమాతో భారీగా బరువు పెరిగిన ఈయన.. ఆ తర్వాత సాహో సినిమా కోసం మళ్లీ స్లిమ్ గా మారిపోయారు. భారీ యాక్షన్ సీక్వెల్ చేయడంతో ప్రభాస్ ఆరోగ్యం కాస్త దెబ్బ తిన్నట్లు రూమర్లు వచ్చాయి సినిమా షూటింగ్ సమయంలో పాన్ ఇండియా స్టార్ హీరో మోకాళ్ళకు సర్జరీ చేసినట్లు పుకార్లు కూడా షికార్లు చేశాయి. తాజాగా ప్రభాస్ ఆరోగ్యం పై పలు వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆయన అనారోగ్య సమస్య కారణంగా తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు చికిత్స కోసం విదేశాలకు వెళ్ళినట్లు తెలుస్తోంది.
మొన్నటికి మొన్న చికిత్స కోసం విదేశాలకు వెళ్లిన ఆయన తిరిగి వచ్చిన వార్త విషయం తెలిసిందే. దీంతో అభిమానులు పూర్తిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే మళ్ళీ విదేశాలకు వెళ్లడంతో అభిమానులు మరింత కలవర పడుతున్నారు.. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కంగారు పడాల్సిన అవసరం లేదని కేవలం క్యాజువల్ హెల్త్ చెకప్ కోసమే ఆయన విదేశాలకు వెళ్లినట్లు ప్రభాస్ టీం చెబుతోంది. మరొకవైపు ప్రభాస్ పై టాలీవుడ్ లో రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. తన హెల్త్ కోసం కొన్నాళ్లపాటు సినిమా షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చిన ఈయన త్వరలోనే మళ్లీ సినిమా షూటింగ్ లలో పాల్గొనబోతున్నట్లు సమాచారం.
ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న..సలార్ తో పాటు మారుతి సినిమా షూటింగ్లో కూడా రెగ్యులర్గా పాల్గొంటున్నారు.. మరొకవైపు మధ్య మధ్యలో నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కె షూటింగ్ కి కూడా హాజరవుతున్నారు.. ఇంకొక వైపు ఆది పురుష్ కూడా లైన్ లో ఉంది . అలాగే సందీప్ రెడ్డి తో స్పిరిట్ సినిమాకు కూడా ఓకే చెప్పారు. ఇలా వరుస సినిమాలతో ఆయన విశ్రాంతి లేకుండా పనిచేయడం వల్లే ఇలా అనారోగ్య భారిన పడ్డట్టు తెలుస్తోంది.