టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా భారీ పాపులారిటీ అందుకున్న హీరోయిన్ సిమ్రాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉన్న ఈమె.. అందం, అభినయంతో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన సిమ్రాన్ గ్లామర్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచింది. అందంతోనే కాదు నటనతో కూడా ఆకట్టుకున్న ఈ చిన్నది.. దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
కెరియర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమైన ఈమె గత కొంతకాలంగా అడపాదడపా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూ మెప్పిస్తోంది. ఇప్పటికీ కూడా తరగని అందంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. మరింత పాపులారిటీ దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది.. ఇదిలా ఉండగా సిమ్రాన్ , బాలకృష్ణ జోడి కి అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. మొన్నామధ్య శివ కార్తికేయన్, సమంత కాంబినేషన్లో వచ్చిన సీమ రాజా సినిమాలో కూడా లేడీ విలన్ గా నటించి మెప్పించింది సిమ్రాన్.
ఇదిలా ఉండగా సిమ్రాన్ దాదాపు అందరి హీరోలతో నటించింది కానీ ఆ ఒక్క హీరోతో మాత్రం నటించలేదట. ఎందుకంటే ఆ హీరో అంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండేది కాదట.. కానీ ఆ హీరో మాత్రం సిమ్రాన్ ను అమితంగా ఇష్టపడేవాడని.. ఆమెతో మాట్లాడటానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండే వారని సమాచారం. అయినా కూడా సిమ్రాన్ అతడిని పట్టించుకునేది కాదట. తన గురించి తానే అతడు గొప్పలు చెప్పుకున్నా సరే.. ఆమె పక్కకు నెట్టేదట. తనతో నటించిన హీరోయిన్స్ తో వల్గర్ గా ప్రవర్తిస్తున్నాడని తెలిసి అతడిని దూరం పెట్టేసింది. అంతేకాదు అతడు సిమ్రాన్ ను పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నాడట. కానీ సిమ్రాన్ మాత్రం అతడి గురించి తెలుసుకొని దూరం పెడుతూ వచ్చిందని సమాచారం.