తెలుగు ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. చిరంజీవి సోదరుడు అయినప్పటికీ తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఒకవైపు సినిమాలలో మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్గానే ఉంటూ పాల్గొంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో వరుసగా నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగులో పాల్గొంటూనే ఎప్పటికప్పుడు రాజకీయాలలో కూడా చురుకుగా పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్.
ఈసారి వచ్చే ఎన్నికలలో ఎలాగైనా కచ్చితంగా గెలవాలని తపనతో పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ సినిమాల గురించి రెమ్యూనరేషన్ గురించి పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కోట్లల్లో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారని వార్తలు వినిపించాయి.తాజాగా ఈ వార్తలపై పవన్ కళ్యాణ్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు అనే విషయంపై బహిరంగంగా తెలియజేయడం జరిగింది. తాను రోజుకి కేవలం రూ .2 కొట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా తెలియజేశారు.
అంతేకాకుండా నెలలో కేవలం ఒక సినిమా కోసం 22 రోజులు మాత్రమే పని చేస్తానని ఆ ప్రకారంగా ఒక్కో చిత్రానికి కేవలం రూ.44 కోట్ల రూపాయలు తీసుకుంటున్నానని ఓపెన్ గా తెలియజేశారు. తనపై రాజకీయంగా విమర్శలు చేసే వారికి సమాధానం చెబుతూ ఈ వాక్యాలు చేయడం జరిగింది తాను డబ్బు కోసం ఆశపడే వ్యక్తిని కాదు అంటూ కావాలంటే తానే డబ్బులు ఇస్తానని తెలిపారు పవన్ కళ్యాణ్ తాజాగా మచిలీపట్నంలో జరిగిన జనసేన పదోవ ఆవిర్భావన సభలో ఈ వాక్యాలు చేయడం జరిగింది.