టాలీవుడ్ లో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు పొందారు దేవిశ్రీప్రసాద్. దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి దేవిశ్రీప్రసాద్ పెళ్లి విషయం వైరల్ గా మారుతూనే ఉంది. ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో హార్ట్ టాపిక్ గా మారుతోంది. ఇండస్ట్రీలో కొన్నేళ్లపాటు సంగీత ప్రపంచాన్ని ఒక వెలుగు వెలిగిన దేవిశ్రీప్రసాద్. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోకి దూరంగా ఉన్నారు కేవలం పుష్ప సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ పాడి అందరినీ ఆకట్టుకున్నారు. తమన్ ఈ మధ్యకాలంలో హవా బాగా పెరిగిపోవడంతో దేవిశ్రీప్రసాద్ కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే స్టార్ హీరోలు కూడా దేవిశ్రీప్రసాద్ కు అవకాశాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. ప్రతి ఒక్కరు కూడా తమన్ పేరుని ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలో దేవి శ్రీ ప్రసాద్ కెరియర్ ఎండ్ స్టేజ్ కి వచ్చిందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలోనే దేవిశ్రీప్రసాద్ పెళ్లి చేసుకోవడానికి ఫిక్స్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి గతంలో చార్మి తో దేవి శ్రీ ప్రసాద్ ప్రేమాయణం నడిపారు వివాహం కూడా చేసుకోవాలనుకున్నారు కానీ సడన్గా ఏమైందో ఏమో తెలియదు కానీ ఆమెను ఒక్కసారిగా దూరం పెట్టేశారు.
దేవి శ్రీ ప్రసాద్ తండ్రి మరణించిన తర్వాత దేవిశ్రీప్రసాద్ పెళ్లిపైన అసలు ఇంట్రెస్ట్ చూపలేదు. ఫైనల్ గా ఇన్నేళ్లకు వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వివాహం చేసుకోబోతున్నది ఎవరినో కాదు తన సొంత మరదల్ని అన్నట్లుగా సమాచారం. ఈ పెళ్ళికి సినీ ప్రముఖులు ఎవరు కూడా పిలవలేదని ఎందుకంటే ఈ వివాహం సింపుల్గా చేసుకోవడానికి చూస్తున్నట్లు సమాచారం. దీంతో మరొకసారి దేవిశ్రీప్రసాద్ పేరు వైరల్ గా మారుతోంది.