జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత పలు చిత్రాలలో కీలకమైన రోల్స్ లో నటించింది. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో ఈ సెలబ్రిటీ పేరును సంపాదించుకుంది నటి అనసూయ .సోలోగా ఎంట్రీ ఇచ్చిన పలు ప్రాధాన్యత ఉండే పాత్రలోనే నటిస్తోంది. దాదాపుగా అనసూయ నటించిన చిత్రాలు అన్ని కూడా హిట్ అయ్యాయని చెప్పవచ్చు. దీంతో ఈమెకు క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి డిమాండ్ ఉంటోంది. ఈ డిమాండ్ వల్లే జబర్దస్త్ షోను కూడా వదిలేసిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
అనసూయ దీంతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్గానే ఉంటూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. సినిమాల విషయానికి వస్తే మొదట రంగస్థలం సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించి ప్రశంసలు అందుకున్న అనసూయ.. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. పుష్ప చిత్రంతో మంచి పాపులారిటీ అందుకుంది. పుష్ప సినిమాలో నటించిన అనసూయ పారితోషకం ఎంత అన్న విషయంపై అప్పట్లో ఎక్కువగా చర్చలు మొదలయ్యాయి. ఈ సినిమాలో నటించిన అందుకు అనసూయ ఒక్కో రోజుకి రూ.1.30 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని సమాచారం.
కేవలం పది రోజులకు గాను రూ.13లక్షలు తీసుకున్నట్లు సమాచారం ఇప్పుడు పుష్ప-2 కు రెమ్యూనరేషన్ సంగతి పక్కన పెడితే మిగతా చిత్రాలకు తనను సంప్రదిస్తే మాత్రం రెట్టింపు తీసుకుంటుందని సమాచారం వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనసూయ రోజుకి 2 లక్షలు తీసుకొనే స్థాయికి వెళ్లిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. టాలెంట్ ఉండడంతో ఆమె పేరుతో బిజినెస్ జరుగుతున్నప్పుడు అంత మాత్రం డిమాండ్ చేయడంలో తప్పేమీ లేదంటూ అభిమానులు భావిస్తున్నారు.