టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ తక్కువ సినిమాలలో నటించిన చిరంజీవి కుమారుడు కావడంతో మంచి క్రేజీ సంపాదించుకున్నారు. ఆ తర్వాత తనకంటూ ఒక సపరేటు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకొని అటు బాలీవుడ్ టాలీవుడ్ లో కూడా తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు రామ్ చరణ్. హాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు.రామ్ చరణ్ గురించి తాజాగా ఒక విషయం వైరల్ గా మారుతోంది.
అదేమిటంటే రామ్ చరణ్ ఆస్తి విలువ టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోల కంటే ఎక్కువ అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి సినిమాల ద్వారా రామ్ చరణ్ భారీగానే సంపాదిస్తున్నారని ఒక్కో చిత్రానికి దాదాపుగా రూ .80 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. ఇక తండ్రి నుంచి వారసత్వంగా చరన్ కు భారీ స్థాయిలోనే ఆస్తులు వచ్చాయని చరణ్ ఆస్తి విలువ మొత్తం రూ.1370 కోట్ల రూపాయలు అన్నట్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఉపాసన నుంచి కూడా భారీగానే కట్న కానుకలు వచ్చినట్లు సమాచారం. మనదేశంలో ఎక్కువ మొత్తంలో పన్ను చెల్లిస్తున్న కొంతమంది హీరోలలో రామ్ చరణ్ కూడా ఒకరట.
రామ్ చరణ్ కు సొంతంగా ఒక ప్రవేట్ జట్టు కూడా ఉంది. రామ్ చరణ్ దగ్గర ఖరీదైన కార్లు ఉండగా వాటి విలువ కోట్లల్లో ఉన్నట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ లో చరణ్ కు ఖరీదైన భవంతి ఉండడంతో పాటు ఈ భవంతి విలువ కొన్ని కోట్లు ఉన్నట్లు సమాచారం. ఇక రామ్ చరణ్ నెల సంపాదన కనీసంరూ .3 నుంచి రూ.10 కోట్ల రూపాయలకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు.